చండీయాగం.. మీడియా కళ్లు..

తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే నెలలో అయత చండీయాగం తలపెట్టారు. ఇది భారీ యాగం.. దాదాపు 10వేల మంది పూజారులు ఈ అయత చండీ యాగంలో పాల్గొంటారు. వేల ఎకరాల్లోని తన పాంహౌస్ లోనే దీన్ని చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇంతటి భారీ యాగానికి గవర్నర్ నరసింహన్, ప్రధాని మోడీలను ఆహ్వానిస్తున్నారు కేసీఆర్.

ఇంతటి భారీ యాగం ఎందుకు చేస్తున్నారంటే

ఎప్పుడో ఉద్యమనాయకుడిగా ఉండగా… 2006లో సీఎం కేసీఆర్ చండీయాగం చేశారు. తెలంగాణ సిద్ధించాలని ప్రార్థించారు. అప్పుడు స్వామీజీలతో చేశారు. మధ్యలో ఒక సారి చిన్న యాగాలు చేశారు. కానీ ఇప్పుడు తలపెట్టిన చండీయాగం తెలంగాణ కలకాలం సుఖశాంతులతో వర్దిల్లాలని వర్షాలు పడాలని , తెలంగాణ కు గ్రహాలన్నీ అనుకూలించాలని కేసీఆర్ ఈ యాగం చేపట్టారట..

దాదాపు 10వేల మంది పూజారులతో చేసే ఈ యాగం వల్ల తెలంగాణ సుభిక్షం అయ్యేవిధంగా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్.. కాగా దీనిపై మీడియా చాలా బాగా ఫోకస్ చేసింది. మీడియాలో కథలు కథలుగా కేసీఆర్ చండీయాగంపై ప్రసారాలు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *