Breaking News

చండీయాగం కలిపింది ఇద్దరినీ..

TRS-KCR-ABN-Radha-Krishna-Photos

తెలంగాణలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం పెంచుకున్న ఆ ఇద్దరు ఆగర్భ శత్రువులు ఇప్పుడు చండీయాగం సాక్షిగా మళ్లీ మిత్రులయ్యారు.. కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు మిత్రులుగా.. తెలంగాణ ఏర్పడ్డాక రాజకీయ పరిణామాలతో శత్రువులుగా మారిపోయిన సీఎం కేసీఆర్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణలు చండీయాగం సాక్షిగా ఒక్కటయ్యారు.. ఒకరినొకరు అలయ్ బలయ్ చేసుకొని పలకరించుకున్నారు. వారి అప్యాయతకు అక్కడున్న మీడియా మిత్రుల కెమెరాలు క్లిక్ క్లిక్ మన్నాయి..

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తో కలిసి వచ్చిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు మంత్రి హరీష్ స్వాగతం పలకి లోపలికి తోడ్కొని పోగా కేసీఆర్ వీరిని సాదరంగా ఆహ్వానించడం విశేషం.. ఇక ఆంధ్రజ్యోతికి, కేసీఆర్ కు మధ్య వైరం ముగిసినట్టే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *