ఘోరంగా ఓడిపోయిన మాజీ సీఎంలు

ఢిల్లీ, ప్రతినిధి : జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఓటమి పాలయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఘోరంగా ఓడిపోయారు. సోన్వాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన, పీడీపీ అభ్యర్థి మహమ్మద్ అష్రఫ్ చేతిలో పరాజయం పాలయ్యారు. మరొక నియోజకవర్గం బీర్వా నుంచి ఓమర్ ఓటమి పాలయ్యారు.

ఇదిలావుండగా జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా ‘జై భారత్ సమంత పార్టీ’ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మజ్‌గాం నియోజకవర్గంలో జేఎంఎం అభ్యర్థి నిరల్ పుర్టి చేతిలో ఈయన ఖంగుతిన్నారు. జార్ఖండ్ సీఎంగా పనిచేసిన కాలంలో మధుకోడా మీద తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడమేకాదు, జైలుశిక్ష అనుభవించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.