ఘనంగా హనుమాన్ జయంతి

తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం తర్వాత ఆలయాలు మూసివేసినా.. రాత్రి సంప్రోక్షణ, ఆలయ శుద్ధి చేసి ఆలయాలు తెరిచారు. అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు.

కొండగట్టు అంజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. కాలినడకన వచ్చిన భక్తులు రాత్రి స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నహనుమాన్ భక్తులు శోభాయాత్రలు నిర్వహించి హనుమాన్ ను పూజించారు.

కరీంనగర్ లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సర్కస్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సివిల్ హాస్పిటల్ నుంచి టవర్, తెలంగాణ చౌరస్తా వరకు కొనసాగింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *