ఘనంగా స్వర్గీయ జువ్వాడి చొక్కారావు జయంతి వేడుకలు

ఘనంగా స్వర్గీయ జువ్వాడి చొక్కారావు జయంతి వేడుకలు

మాజీ పార్లమెంట్ సభ్యుడు స్వర్గీయ జువ్వాడి చొక్కారావు 92వ జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని పలుచోట్ల ఘనంగా జరిగాయి. మొదట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ప్రభుత్వవిప్ ఆరెపల్లి మోహన్ , డిసిసి గ్రీవెన్స్ సెల్ కన్వీనర్ పొన్నమనేని గోపాలకిషన్ రావు లు ముఖ్యఅతిధులుగా హజరై చొక్కారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్  మాట్లాడుతూ స్వర్గీయ చొక్కారావు  పార్లమెంటు సభ్యులుగా, మంత్రిగా తెలంగాణ ప్రాంత బోర్డు సభ్యులుగా జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పలు పదవులు చేపట్టి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ముఖ్యంగా చొక్కారావు రాజకీయాల్లో యువతను ఎక్కువగా ప్రోత్సహించారని అన్నారు.

JUVVADI NEW 2                                                                                                                             అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని చొక్కారావు విగ్రహనికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు కర్ర రాజశేఖర్ , రాష్ట్ర్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నిఖిల్ చక్రవర్తి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కరీంనగర్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జువ్వాడి నిఖిల్ చక్రవర్తి  ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డులోని వీరబ్రహ్మేంద్ర వృద్ధులు, వికలాంగుల ఆశ్రమంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాదాసు శ్రీనివాస్, ఆకుల రాము, వెన్న రాజమల్లయ్య, మూల జైపాల్, ఆమ ఆనంద్, గందె మహేష్, తాడ వీరారెడ్డి, ఇమ్రాన్, పోతారపు సురేందర్. జీలరాజు యాదవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *