ఘనంగా సోనియా జన్మదినోత్సవం

కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 69వ జన్మదినోత్సవం సందర్బంగా కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ తల్లి రూపంలో ముద్రించిన ప్రత్యేక ఫెక్సీపై పూలు, పాలు పోసి కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సోనియా తెలంగాణ దేవత అని కొనియాడారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు , నగర కాంగ్రెస్ అధ్యక్షులు కర్ర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం పట్టణంలోని కార్ఖానాగడ్డలోని అనాథ వృద్ధుల ఆశ్రమంలో కాంగ్రెస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *