Breaking News

ఘనంగా మంచు మనోజ్ వివాహం

04manchu-manoj2

హైదరాబాద్ : మంచు మనోజ్ వివాహం అనుకున్న సమయానికి ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ఘనంగా జరిగింది. వేదమంత్రాల మంత్రోఛ్ఛరణల మధ్య మంచు మనోజ్ మూడు ముళ్లు వేశారు. అనంతరం తల్లిదండ్రులు మోహన్ బాబు, అన్నయ్య విష్ణు, అక్క మంచులక్ష్మీల ఆశీర్వాదాలను మనోజ్ తీసుకున్నారు.

అనంతరం పెళ్లి పీటల నుంచి వేదిక మీదకు వచ్చిన మనోజ్ దంపతులను పెళ్లికి వచ్చిన అతిథులు ఆశీర్వదించారు. సీనీ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. హీరో రజీనీకాంత్, సునీల్, బాలకృష్ణ, రాఘవేంద్రావు, రామోజీరావు, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, నాయకులు, కళాకారులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మధ్యాహ్నం సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ వచ్చి ఆశీర్వదిస్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *