ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహకాళి అమ్మవారి లష్కర్ బోనాలు

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహకాళి అమ్మవారి ఆషాడ లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఆదివారం తెల్లవారు జామునుండే భక్తుల తాకిడితో దేవాలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టువస్త్ర్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రి దంపతులకు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలతో  పూర్ణకుంబం వద్ద స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రభుత్వం సమర్పించిన 3కేజీల బంగారు బోనాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. అమ్మవారికి బంగారు ముక్కుపుడక, ఖడ్గం, వజ్రాల బొట్టును మంత్రి తలసాని సమర్పించారు. అంతకు ముందు తెల్లవారు జామున 4-05 గంటలకు రాష్ట్ర్రపశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మహకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి బోనాల సమర్పణకు శ్రీకారం చుట్టారు. ఉదయం 9.30 గంటలకు మోండా మార్కెట్ ఆదయ్యనగర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం తరపున తయారు చేయించిన బంగారు బోనానికి రాష్ట్ర్ర దేవాదయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి ఎ. ఇంద్రకిరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, పార్లమెంట్ సభ్యురాలు కె. కవితకు అప్పగించారు. బోనాలు ఎత్తుకున్న (1008) మంది హహిళల తో కలిసి, బంగారు బోనాన్ని ఎత్తుకుని మహకాళి దేవాలయం వరకు ఊరేగింపుగా ఎమ్ పి కవిత వచ్చారు. ప్రత్యేక పూజలు  జరిపి అమ్మవారికి సమర్పించారు. శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్ర్రమంత్రులు నాయినీ నరసింహరెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, ఇంద్రకిరణ్ రెడ్డి, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్ పి లు,  బండారు దత్తాత్రేయ, గుండు సుధారాణి, సిహెచ్. మల్లారెడ్డి, సంతోష్ కుమార్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్ఎల్ఏ లు శ్రీనివాస్ గౌడ్, కిషన్ రెడ్డి, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. పోతురాజుల వీరంగం, శివసత్తుల విన్యాసాలు,  జానపద కళారూపాలు, కోలాటం, డప్పు, గుస్సాడి, లంబాడి, డోళ్ళు, కొమ్ముకోమ, ఇతర వాయిద్యాలు, నృత్యాలతో కళాబృందాలు ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల సౌకర్యార్ధం ప్రభుత్వం భారీ స్ధాయిలో ఏర్పాట్లు చేసింది. 8 స్టేజీలలో సమాచార పౌరసంబంధాలు, సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కళాబృందాలు ప్రదర్శనలు ఇచ్చాయి.

indrakiran reddy    mp kavitha 1     kcr 1    kcr 2    bandaru    IMG-20180729-WA0043     IMG-20180729-WA0046     IMG-20180729-WA0057     IMG-20180729-WA0059    nayini narasimha reddy

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *