
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె)కు అనుబంధంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్
(టి ఎస్ పి జె ఎ) ఆధ్వర్యంలో సోమవారం నాడు బషీర్ బాగ్ లోని దేశోధ్ధారక భవన్లో ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ వేడుకల్లో వేడుకల్లో ఐజేయూ అధ్యక్షులు దేవులపల్లి అమర్, టీయుడబ్ల్యుజె సలహాదారు కె.శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఐజేయు కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు ఎ.గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి, టీయుడబ్ల్యుజె నాయకులు ఎ.రాజేష్, వి.యాదగిరి, శిగ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.