
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నేడు నాగుల పంచమిని ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే స్థానికంగా ఉన్న పాముల పుట్టల వద్దకు వెళ్లి అందులో ఆవుపాలను పోసి మొక్కులు తీర్చుకున్నారు. కుంకుమ పసుపు , చల్లి కోరుకున్నారు.
ఆదిలాబాద్ లో గోండుల కులదైవ మైన నాగోబాకు గోండులు, గిరిజనులు ఘనంగా పూజలు చేశారు. గిరిజనులంతా ఉదయాన్నే స్థానిక గోదావరిలో వాగుల్లో పూజలు చేసిన నాగోబా కొలువుదీరిన ఊట్నూర్ పరిసరాల్లో పూజలు చేశారు.
కాగా నాగుల పంచమి కావడంతో ఆవుపాలకు డిమాండ్ ఏర్పడింది. బాగా కొరత ఉండడంతో కొంతమంది రేట్లను అమాంతం పెంచేశారు. కొందరు గేదె పాలనే ఆవుపాలగా మార్చి భక్తులను మోసం చేశారు.