Breaking News

ఘనంగా డాక్టర్స్ డే – పలువురు సీనియర్ డాక్టర్లను సన్మానించిన మంత్రి

డాక్టర్స్ డే రోజు పలువురు డాక్టర్లను సత్కరించటం సంతోషంగా ఉంది

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA హైదరాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో ఉస్మానియా మెడికల్ కాలేజీ alumni భవనంలో డాక్టర్స్ డే శనివారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి ముఖ్య అతిథి గా హాజరయ్యారు.
మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ డాక్టర్స్ డే రోజు పలువురు డాక్టర్లను సత్కరించటం సంతోషంగా ఉందన్నారు.
ప్రభుత్వ వైద్యం గాడిలో పడుతుందన్నారు.ఎక్కడా లేని విధంగా శస్త్ర చికిత్సలు ఇప్పుడు ఉస్మానియా లాంటి ప్రభుత్వ హాస్పిటల్స్ లో జరుగుతున్నాయన్నారు.
డాక్టర్ చింతకింది మధుసూదన్ లాంటి డాక్టర్లు అందుబాటులో ఉన్న సదుపాయాలతో శస్త్ర చికిత్సలు చేస్తున్నారుప్రభుత్వ దవాఖానాల్లో సదుపాయాలు పెంచాం అందుకే ఓపి 30 శాతం నుంచి 35 శాతం పెరిగిందని మంత్రి చెప్పారు.
కేసీఆర్ కిట్ల పథకం వల్ల సర్కార్ దవాఖానాల్లో ప్రసవాలు పెరిగాయి. సీనియర్ డాక్టర్ల సలహా సంప్రదింపులతో ఇంకా మంచి వైద్యం అందిస్తామన్నారు. డాక్టర్స్ డే సందర్బంగా పలువురు సీనియర్ డాక్టర్లను మంత్రి సన్మానించారు.
ఈ కార్యక్రమం లో రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అరుణ రామయ్య, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ gvs మూర్తి, సీనియర్ డాక్టర్లు పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *