
మెగా స్టార్ చిరంజీవి 60వ బర్త్ డే వేడుకలు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఆయన కుమారుడు హీరో రాంచరణ్ ఏర్పాట్లను దగ్గరుండి ఘనంగా నిర్వహించారు. సినీ పరిశ్రమలోని ప్రతీ ఒక్క నటుడు, దర్శకులు, ఆర్టిస్టులు హాజరయ్యారు. బాలీవుడ్, కోలీవుడ్, దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వేడుకల్లో మొన్న వేడుకలకు హాజరైన ఆయన తమ్ముడు, హీరో పవన్ కళ్యాణ్ హాజరుకావడం విశేషం..