
గణేశ్ నిమజ్జనం ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో గణేషులకు చివరి పూజలు చేసి నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా భారీగా గణేష్ శాభాయాత్ర చేశారు. పెద్దపెద్ద వినాయకులను క్రేన్ల సహాయంతో ట్రాక్టర్లు, లారీలపై పెట్టి వాటి ముందు తెల్ల దుస్తులు, బొట్టు గణేష్ బ్యాండ్లు కట్టుకొని ఘనంగా శోభాయాత్ర చేశారు..
భక్తులు శోభాయాత్రలో ఈ సారి డిజే సౌండ్ లను పోలీసులు నిషేధించారు. దీంతో డప్పులను తెచ్చుకున్నారు. బ్యాండ్లు, ఒగ్గు డోలు కళాకారులు వివిధ గణపతుల వద్ద శోభాయాత్రలో తమ విన్యాసాలతో అలరించారు. ఇక డీజేలు లేకపోవడంతో భక్తుల డప్పులతోనే శోభాయాత్ర నిర్వహించారు.
కరీంనగర్ లో టవర్ సర్కిల్, కోతిరాంపూర్, లక్ష్మీనగర్, మంకమ్మతోటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో శోభాయాత్ర ఘనంగా జరిగింది. లక్ష్మీనగర్ లో రాత్రి రెండు గ్రూపులు గొడవపడి దాడులు చేసుకున్నాయి.. స్థానికులు, పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఇక హైదరాబాద్ లో ఈరోజు నిమజ్జనం జరగనుంది..