Breaking News

ఘనంగా గణతంత్ర దినోత్సవం

flag-hoisting-republic-day-parade-live-streaming-from-delhi

-ఢిల్లీలో జాతీయ జెండా ఎగురవేసిన రాష్ట్రపతి ప్రణబ్
-హైదరాబాద్, విజయవాడల్లో జెండా ఎగురవేసిన గవర్నర్ నరసింహన్
హైదరాబాద్, ప్రతినిధి : భారత గణతంత్ర దినోత్సవ వేడులకు ఢిల్లీలో అంబరాన్నంటాయి. విశిష్ట అతిథి  అమెరికా అధ్యక్షుడు కొలువుదీరగా.. ప్రణబ్ ముఖర్జీ జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ప్రారంభించారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి మనోహర్ పారికర్, కేంద్ర మంత్రులు ,ప్రజలతో రాజ్ పథ్ కిక్కిరిసి పోయింది. జెండా ఆవిష్కరణ అనంతరం వివిధ భారత దళాల కవాతు, గౌరవవందనంను రాష్ట్రపతి స్వీకరించారు. అనంతరం వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోనాలు, గొల్కొండ కోటతో తెలంగాణ శకటం.. బోనాల పాటతో సాగింది.
governar narasimhan
ఇక రాష్ట్రంలో విజయవాడలో ముందుగా గవర్నర్ జెండావిష్కరించి గణతంత్ర దినోత్సవాలను ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ వచ్చి ఇక్కడ గణతంత్ర దినోత్సవాలను ప్రారంభించారు. తన ప్రసంగంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రగతి, పథకాలను వివరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *