Breaking News

ఘనంగా కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసిఆర్ కడియం శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసుధనాచారి కడియం శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్లు, మేయర్లు, జడ్పీ చైర్ పర్సన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉప ముఖ్యమంత్రి కడియం జన్మదినం సందర్భంగా పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు చెప్పారు. విద్యాశాఖ అధికారులు, జిల్లా అధికారులు, సిబ్బంది కూడా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వరంగల్ లోని విద్యార్థులు, మీడియా ప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ఆయన నివాసానికి వచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *