
కొద్దిరోజులుగా టీఎస్పీఎస్సీ నుంచి ఉద్యోగ ప్రకటనలు రాక ఆ సంస్థ చైర్మన్ ఘంటా చక్రపాణి తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. నిన్న ఉద్యోగ ప్రకటనలో ఆయన మాటలు కూడా ప్రభుత్వానిదే తప్పు అన్నట్టు మాట్లాడారు. ప్రభుత్వం ఇస్తేనే తాము నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటనలు ఆలస్యం చేయడంపై గుర్రుగా ఉన్న ఘంటా చక్రపాణి ఆ కోపం లోపలే పెట్టుకున్నట్టు ఉన్నాడు.. అందుకే టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో సీఎం కేసీఆర్ ఫొటోనే పెట్టలేదు.. రాష్ట్రపతిది, గవర్నర్ ది.. యూపీఎస్సీ , కేంద్ర అధికారుల ఫొటోలు పెట్టారు కానీ తెలంగాణ రాష్ట్ర సీఎం ఫొటోనే పెట్టలేదు.. కేటీఆర్ అభినందిస్తున్న ఫొటో కూడా ఉంది కానీ కేసీఆర్ ఫొటోను తీసేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఆయన ఫొటో టీఎస్ప్పీఎస్ లో లేకపోవడంపై అందరూ ముక్కన వేలేసేకుంటున్నారు.