గ‌ణేష్ ఉత్స‌వాల ప్ర‌శాంత నిర్వ‌హ‌ణ‌కు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేద్దాం : జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దానకిషోర్‌

  సెప్టెంబ‌ర్ 13న ప్రారంభ‌మ‌య్యే గ‌ణేష్ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు, 23న జ‌రిగే నిమ‌జ్జ‌న శోభ‌యాత్ర‌ల‌ను ఏవిధ‌మైన అడ్డంకులు లేకుండా స‌మ‌న్వ‌యంతో కృషిచేయాల‌ని  విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు వివిధ శాఖ‌ల‌తో మ‌రింత స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారుల స‌మావేశంలో నిర్ణ‌యించారు. జీహెచ్ఎంసి ప్రధాన‌ కార్యాల‌యంలో గ‌ణేష్ ఉత్స‌వాలు, మోహ‌రం  పండుగ‌ల నిర్వ‌హ‌ణ‌ల‌పై నేడు జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్‌ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశానికి హైద‌రాబాద్ పోలీసు అద‌న‌పు క‌మిష‌న‌ర్ చౌహాన్‌, ట్రాఫిక్ విభాగం అడిష‌న‌ల్ సిపి అనిల్‌కుమార్‌, జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు హ‌రిచంద‌న‌, శృతిఓజా, ముషారఫ్ అలీ, డిజాస్ట‌ర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటితో పాటు వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.  ఈ సంద‌ర్భంగా జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ మాట్లాడుతూ గ‌ణేష్ నిమ‌జ్జ‌నం, మోహ‌రం పండుగ‌లు ఒకేసారి వ‌స్తున్నందున ఏవిధ‌మైన అవాంఛ‌నీయమైన సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసు, జీహెచ్ఎంసి, రెవెన్యూ, విద్యుత్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు మ‌రింత స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. న‌గ‌రంలోని ప్ర‌తి స‌ర్కిల్‌లో సంబంధిత అధికారులతో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేయ‌డంతో పాటు వివిధ అంశాల‌పై స‌త్వ‌ర‌మే స్పందించేందుకుగాను ప్ర‌త్యేక క‌మ్యునికేష‌న్ ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాల‌ని  సూచించారు. వినాయ‌క చ‌వ‌తి ప్రారంభానికి ముందుగా సెప్టెంబ‌ర్ 10వ తేదీలోపు న‌గ‌రంలోని రోడ్ల‌పై ఏవిధ‌మైన నిర్మాణ వ్య‌ర్థాలు, చెత్త‌, గుంత‌లు లేకుండా ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికతో ప‌నిచేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సారి గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి క్రెయిన్‌ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను జీహెచ్ఎంసీకి అప్ప‌గిస్తూ ప్ర‌భుత్వం నిర్ణయించినందున జీహెచ్ఎంసీ ప‌రిధిలోని అన్ని చెరువులు, ప్ర‌ధాన నిమ‌జ్జ‌న ప్రాంతాల్లో క్రెయిన్‌ల ఏర్పాటు, వాటి నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన సిబ్బందిని నియ‌మించ‌డానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. న‌గ‌రంలో ఎస్‌.ఆర్‌.డి.పి, మెట్రోరైలు ప‌నులు, రోడ్డు నిర్మాణ ప‌నులు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నందున ఈ మార్గాల్లో రోడ్ల మ‌ర‌మ్మ‌తులు, నిర్వ‌హ‌ణ మ‌రింత ప‌క‌డ్బందీగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు. గ‌ణేష్ నిమ‌జ్జ‌న ప్ర‌ధాన ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మ‌ల‌ను ఇత‌ర అడ్డంకుల‌ను తొల‌గించాల‌ని క‌మిష‌న‌ర్ ఆదేశించారు. గ‌ణేష్ ఉత్స‌వాలు, నిమ‌జ్జ‌నంల‌పై త్వ‌ర‌లోనే భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేష్ ఉత్స‌వ స‌మితితో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేస్తున్నామ‌ని, వివిధ శాఖ‌లు త‌మ శాఖాప‌రంగా చేప‌ట్టాల్సిన ప‌నుల కార్యాచ‌ర‌ణ‌ను సిద్దం చేసుకోవాల‌ని దాన‌కిషోర్ స్ప‌స్టం చేశారు. గ‌ణేష్ నిమ‌జ్జ‌న మార్గాల్లో రోడ్ల మ‌ర‌మ్మ‌తులు, నిర్మాణం త‌దిత‌ర ప‌నుల‌కు ముంద‌స్తు అనుమ‌తుల‌ను తీసుకొని వెంట‌నే ప‌నుల‌ను ప్రారంభించాల‌ని స్ప‌ష్టం చేశారు.  ఈ స‌మావేశంలో జోన‌ల్ క‌మిష‌న‌ర్లు రవికిర‌ణ్‌, ర‌ఘుప్ర‌సాద్‌, శ్రీ‌నివాస్‌రెడ్డి, శంక‌ర‌య్య‌, చీఫ్ ఇంజ‌నీర్ సురేష్‌, డి.సి.పి వెంక‌టేశ్వ‌ర‌రావు, ట్రాన్స్‌కో డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి, వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.
బ‌ల్దియా ఆధ్వ‌ర్యంలో 20వేల మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల పంపిణీ
ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కుగాను న‌గ‌రంలో ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారీస్‌తో త‌యారుచేసే వినాయ‌క విగ్ర‌హాల స్థానంలో ప‌ర్యావ‌ర‌ణ హిత మ‌ట్టి వినాయ‌కుల‌ను పూజించాల‌ని న‌గ‌ర‌వాసుల‌కు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇందుకుగాను జీహెచ్ఎంసీ ద్వారా 20వేల మ‌ట్టి వినాయ‌కుల‌ను ఉచితంగా న‌గ‌ర‌వాసుల‌కు పంపిణీ చేయ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. మ‌ట్టివినాయ‌కుల త‌యారీకి గాను టెండ‌ర్ ప్ర‌క్రియ కూడా పూర్తి అయ్యింద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌ట్టి వినాయ‌కుల‌నే ఉప‌యోగించాల‌ని కోరుతూ ఇప్ప‌టికే న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక చైత‌న్య కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని గుర్తుచేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *