సిఆర్ పీఓ ‘‘గ్రేటర్ హైదరాబాద్ ’’అధ్యక్షుడుగా వంగూరి యాదవ రెడ్డి

వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్ధ ‘‘గ్రేటర్ హైదరాబాద్ ’’అధ్యక్షుడుగా ఆర్ కె పురం కి చెందిన ‘‘శ్రీ వంగూరి యాదవ రెడ్డి’’ గారిని నియమిస్తూ ఆ సంస్ధ రాష్ట్ర్ర అధ్యక్షుడు శ్రీ మేరుగు శ్రీనివాస్ రెడ్డి నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన
అధ్యక్షుడు వంగూరి యాదవ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులుగా మనకు కొన్ని హక్కులు ఉన్నాయని, ఆ హక్కులను నెరవేర్చుకోవటం మన బాధ్యత అని అన్నారు. మన హక్కులను కాపాడుకోవాలంటే… ముందుగా ఆ హక్కులేమిటో మనకు తెలియాలని, ఆ
హక్కులకు భంగం వాటిల్లినపుడు ప్రశ్నించి వాటిని సాధించుకోవాలన్నారు. మోసాలు, కొలతలు, ఇబ్బందులు, సేవలు ఇలా ఏ అంశంలోనైనా వినియోగదారుడికి ఇబ్బంది కలిగితే వినియోగదారులు హక్కుల చట్టం ద్వారా వారు సమస్య పరిష్కారంతో పాటు నష్టపరిహరం
పొందవచ్చునని తెలియజేశారు. వినియోగదారుడిగా సేవలకు ఆటంకం కలిగినా, నష్టం వాటిల్లినా సంబంధిత వ్యక్తులపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని, రూ. 50 లక్షలలోపు నష్టపరిహరం జరిగితే జిల్లా వినియోగదారుల ఫోరంలోను, కోటి రూపాయల లోపు అయితే రాష్ట్ర్ర కమిషన్ కు,
కోటి రూపాయల పైబడి నష్టపరిహరం కోరితే జాతీయ కమిషన్ కు వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఈ సందర్భంగా వంగూరి యాదవ రెడ్డి సంస్ధ రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కుసుంభ వెంకట రమణ రావు గారికి ధన్యవాదాలు తెలియజేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *