గ్రేటర్ ప్రభంజనం.. పొలిటికల్ ఫ్యాక్టరీ చెప్పింది అక్షర సత్యం..

ఊహకందని రాజకీయాలు.. ఎప్పుడు ఎటు మారుతుందో తెలియని ఓట్ల పండుగ.. అన్నింటికి మించి సగటు ఓటరు మదిలో ఏముందో తెలుసుకునే నిశిత పరిశీలన.. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే పొలిటికల్ ఫ్యాక్టరీ చెప్పిన కథనం.. అక్షర సత్యం అయ్యింది.. డిసెంబర్ 12, 2015 లోనే గ్రేటర్ పీఠంపై టీఆర్‘ఎస్’ అంటూ పొలిటికల్ ఫ్యాక్టరీ ఒక వాస్తవికత.. దూరదృష్టితో ప్రజల నాడిని తెలుసుకొని ఒక వార్తను ప్రచురించింది.. ఆ వార్త నేడు గ్రేటర్ రిజల్ట్స్ వచ్చిన వేళ నిజమయ్యింది. ఏబీపీ నీల్సన్, ఎన్టీవీ, తెలుగు మీడియా చానాళ్లు, జాతీయ చానాళ్లు అన్నీ కూడా టీఆర్ఎస్ కు 50 మించి సీట్లు రావని అప్పుడు సర్వేలో తేల్చాయి.. కానీ ఒక్క పొలిటికల్ ఫ్యాక్టరీ మాత్రమే.. దమ్ము ధైర్యంతో ప్రజల నాడిని తెలుసుకొని టీఆర్ఎస్ కు 92 సీట్లు వస్తాయని అప్పుడే సర్వే చేసి చెప్పింది..

greater

ఇప్పుడు మా సర్వే నిజమని నిరూపితమైంది. మేం చేసిన సర్వేలో వాస్తవానికి దగ్గరగా ఉందని రుజువైంది. మేటి చానాళ్లు పత్రికలను తోసిరాజని చేసి సర్వేతో పొలిటికల్ ఫ్యాక్టరీ సర్వే పోటీ టీఆర్ఎస్ గెలుచుకున్న 99 సీట్లకు సమానంగా విశ్లేషణ చేయగలిగింది. దమ్మున్న వార్తలతో దుమ్ము రేపుతున్న పొలిటికల్ ఫ్యాక్టరీ సర్వే అక్షర సత్యం అయినందుకు గర్విస్తున్నా.. సర్వేలో నిజాలను నిగ్గు తేల్చిన మా పాత్రికేయ బృందాన్ని కొనియాడుతున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *