
హైదరాబాద్, ప్రతినిధి : జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగురవేసేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.. దీనిపై గ్రేటర్ నేతలకు దిశానిర్ధేశం చేశారు. నిన్న తెలంగాణ భవన్లో గులాబీనేతలతో గులాబీ బాస్ భేటీ నిర్శహించారు. కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎలాగైనా బల్దియాలో గులాబీ జెండా ఎగురవేయాలని అధినేత ఆదేశించారు. అలాగే కొంతకాలంగా ఖాళీగా ఉన్న… టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్ష పదవిని భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సమావేశం అనంతరం టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో త్వరలో సభ్యత్వ నమోదు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు జగదీశ్ తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. టీఆర్ఎస్లోకి కొత్తగా చాలా మంది చేరుతున్నప్పటికీ పాత వాళ్లకు సముచిత స్థానం లభిస్తుందని వివరించారు.