గ్రేటర్ పీఠంపై టీఆర్‘ఎస్’

-సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్ కు ఆదరణ

-గ్రేటర్ లో టీడీపీ,కాంగ్రెస్ లనుంచి వలసలతో టీఆర్ఎస్ బలోపేతం

-పొలిటికల్ ఫ్యాక్టరీ సర్వేలో గ్రేటర్ లో టీఆర్ఎస్ కు 92 సీట్లు

హైదరాబాద్ : గడిచిన 2014 ఎననికల్లో టీఆర్ఎస్ హైదరాబాద్ పరిధిలో కేవలం రెండే ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. టీడీపీ-బీజేపీ కూటమి మొత్తం ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో టీఆర్ఎస్ కు సంపూర్ణ ఆధిక్యం రావడంతో టీఆర్ఎస్ గెలిచి అధికారం చేపట్టింది..

కానీ అధికారం చేపట్టిన 14 నెలల్లో టీఆర్ఎస్ ఎంతో చేసింది.. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల మనసుల్ని గెలిచింది.. టీఆర్ఎస్ కు వలసలు మొదలయ్యాయి.. టీడీపీ, కాంగ్రెస్ లనుంచి టీఆర్ఎస్ లో చాలా మంది పేరున్న నాయకుల నుంచి కిందిస్థాయి కార్యకర్త దాకా చేరిపోవడంతో ప్రతిపక్షాల ఉనికే ప్రశ్నార్థకమైంది..

గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఒకప్పుడు అసలు టీఆర్ఎస్ ఉనికే లేదు. కానీ హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లు, కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ లాంటి సంక్షేమ పథకాలతో జనంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఆసరా, ఫించన్లు తదితర సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ ను బలంగా తయారు చేశాయి. ఇప్పుడు గ్రేటర్ ప్రతీ కార్యకర్త టీడీపీ, కాంగ్రెస్ లనుంచి వచ్చి టీఆర్ఎస్ లో చేరారు. చాలా మంది పేరున్న మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఇప్పుడు గ్రేటర్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయం గా కనిపిస్తోంది..

పొలిటికల్ ఫ్యాక్టరీ సర్వేలో టీఆర్ఎస్ 92 స్థానాలు
మంత్రి కేటీఆర్ నిన్న చేసిన ప్రకటనలో తమకు 150 సీట్లకు 75 సీట్లు ఖచ్చితంగా వస్తాయని.. ఎంఐఎంతో సహా ఏ ఇతర పార్టీతో పొత్తు లేకుండా సొంతంగా గెలుస్తామని అన్నారు. కానీ పొలిటికల్ ఫ్యాక్టరీ నెలరోజులుగా హైదరాబాద్ లో ప్రజలు, నాయకుల అభిప్రాయం కోరినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పాలనకు జనం ఓటేశారు. సీమాంధ్రులు కూడా ఇక్కడ పరిస్థితులు పరిపాలన, శాంతిభద్రతల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సర్వేలో దాదాపు 92 సీట్లలో టీఆర్ఎస్ విజయం సాధించి సింగిల్ గా గ్రేటర్ పీటం అధిరోహించే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.. సో ప్రతిపక్షాలు పారాహుషార్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *