Breaking News

గ్రేటర్ గెలుపుతో మంత్రి పదవికి లింక్

22-6a3

 జీహెచ్ఎంసీ ఎన్నికలు మంత్రి తలరాతను మార్చబోతున్నాయి.. ఈ ఫలితాలపైనే మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ భవిష్యత్తు ఆధారపడి ఉండబోతోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు సంకేతాలు అందినట్టు సమాచారం.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రస్తుతం తలసాని ఆయన సనత్ నగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలోని డివిజన్లలో పర్యటిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు.ఇప్పుడు జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ గెలుపుపైనే తలసాని రాజీనామా ఆధారపడి ఉందట..

గ్రేటర్ గులాబీ పార్టీ ఘనవిజయం సాధిస్తే.. సనత్ నగర్ లో కూడా మెజార్టీ డివిజన్లు సాధిస్తే తలసాని రాజీనామా ఆమోదించి ఎన్నికలకు వెళ్దామని కేసీఆర్ సూచించారట.. దీంతో తలసాని మంత్రిపదవికి, ఎమ్మెల్యే పదవి పోయి మళ్లీ ఎన్నికల తర్వాతే ఆయన  గెలిస్తే మళ్లీ మంత్రి పదవి దక్కుతుందన్న మాట.. మొత్తానికి గ్రేటర్ ఫలితాలు మంత్రి తలసానికి పెద్ద చిక్కులు తెచ్చిపెట్టాయి.. ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో తలసాని సతమతమవుతున్నారట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *