
రాష్ట్రాల్లో ఉద్యోగ నియామకాలైన గ్రూప్ 2,3,4 ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు నిర్వహించవద్దంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది.. ప్రధాని ఆగస్టు 15న కింది స్తాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు వద్దని సూచించారని.. ఆయన ఆదేశాల మేరకు గ్రూప్ కిందిస్తాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించవద్దంటూ కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది..
పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.. కాగా టీఎస్ పీఎస్ సీ ఇప్పటికే గ్రూప్ 2,3 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపింది. మరి కేంద్రం సూచనతో వెనక్కి తగ్గుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది..