
కరీంనగర్: నవంబర్ 11,13 తేదీలలో జరుగు గ్రూపు-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేటు సమావేశ మందిరంలో గ్రూపు-2 పరీక్షల నిర్వహణపై తెలంగాణ పబ్లిక్ కమీషన్ మెంబర్ ప్రొపెసర్ సాయిలు తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో మొత్తం 57,750 మంది గ్రూపు-2 పరీక్షలకు హజరు అవుతున్నారని తెలిపారు. అందుకు గాను జిల్లాలో 139 పరీక్షా కేంద్రాలకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ లో 105 సెంటర్లు 46,194 మంది, హుజురాబాద్ లో 21 సెంటర్లు 7,284 మంది జమ్మికుంటలో 13 సెంటర్లు 4,272 మంది పరీక్షలకు హజరు అవుతున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో తగిన పర్నిచర్ ఉన్నది లేనిది చూచుకోవాలని లైజనాన్ అధికారులను ఆదేశించారు. సరిపడ ఫర్నిచర్ లేనిచో వెంటనే
సంబంధిత చీప్ సూపరిన్ టెండ్ తో మాట్లాడి, జాయింట్ కలెక్టర్ కు తెలపాలని సూచించారు. జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన ఫర్నిచర్ సమకూరుస్తామని తెలిపారు. పరాక్షా కేంద్రాలలో మెడికల్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్ధులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొనుటకు వీలుగా ఆర్టీసీతో మాట్లాడి ప్రత్యేక బసులను నడిపించుటకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలలో స్వచ్చమైన ఫిల్టర్ త్రాగు నీటి వసతి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పరీక్షలు నిర్వహించుటకు తగిన పోలీస్ అధికారులకు సూచించారు. పరీక్షల రోజున జిరాక్స్ సెంటర్లు మూసి వేయించాలని ఆదేశించారు. పరీక్షలు జరుగు పట్టణాలలోని ప్రధాన కూడలిలలో పెద్ద పెద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేసి అభ్యర్ధులు పరీక్షా కేంద్రాలకు త్వరగా చేరుకునేలా మ్యాపులు ప్రదర్శించాలని ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమీషన్ మెంబర్ ప్రొఫెసర్
సాయిలు మాట్లాడుతూ గ్రూపు-2 పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రాలకు చీప్ సూపరిన్ టెండిట్లు ఉదయం 7.30 లోగా వెళ్లాలని సూచించారు. ఇన్విజిలేటర్లు 8.00 గంటల వరకు పరీక్షా కేంద్రాల లోనికి వెళ్లాలని అన్నారు. గ్రూపు-2 పరీక్షలు ఉదయం 10.00 గంటల నుండి 12.30 వరకు సాయంత్రం 2.30 గంటల నుండి 5.00 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్షల కేంద్రాలలోనికి అభ్యర్ధులను ఉదయం 9-45 తర్వాత లోనికి అనుమతించకూడదని తెలిపారు. 10.00 గంటల తర్వాత అభ్యర్ధులను హలు బయటకు వెళ్ల కూడదని సూచించారు. పరీక్షల నిర్వహణలలో సమయ పాలన పాటించాలని అన్నారు. పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లకు సంబందించిన ఏమైనా సమస్యలుంటే వెంటనే జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని వారు పరిష్కరిస్తారని తెలిపారు. చీప్ సూపరిన్ టెండెంట్లకు 1000/- లైజన్ ఆపీసర్లకు 500/- ఇన్విజిలేటర్ల 400/- చొప్పున రెమ్యూనరేషన్ చెల్లించాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి.శ్రీనివాస్, జిల్లా అధికారులు, చీప్ సూపరిన్ టెండెంట్లు, లైజన్ ఆఫీసర్లు తహసీల్దార్లు, ఆర్.డి.ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.