గ్రామ రక్షక దళాల్లో పాలుపంచుకోండి : జిల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్

కరీంనగర్: గ్రామరక్షక దళాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్తాములు కావాలని జిల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్ అన్నారు. దోపిడి దొంగతనాల నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేస్తూ జిల్లా వ్యాప్తంగా, గ్రామ రక్షక దళాలలను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా నేర సమీక్షా సమావేశంలో శుక్రువారం నాడు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ ఆవరణలోని దివంగత ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హల్లో జరిగింది. జిల్లా పోలీస్ అధికారులు గ్రామ రక్షక దళాలపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజా, ప్రభుత్వ ఆస్ధుల పరిరక్షణ కోసం గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని పేర్కొన్నారు. అనాధ, బాలకార్మిక వ్యవస్ధ, మానవ అక్రమ రవాణ నియంత్రణ కోసం ఆపరేషన్ స్మైల్ ను కొనసాగించడం జరుగుతోందని తెలిపారు. నిరంతరం ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలను కొనసాగించాలని ఆదేశించారు. మద్యం, మత్తు పదార్ధాలు సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి వాహనదారుడు ప్రాణాల రక్షణ కోసం హెల్మెట్లను వినియోగించేలా అవగాహన కల్పించాలని చెప్పారు. వివిధ రకాల నేరాల నియంత్రణకు తగు సలహలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓ.ఎస్.డి. ఎల్. సబ్బరాయుడు, గోదావరిఖని ఎ.ఎస్.పి విష్ణు ఎస్. వారియర్, ట్త్ర్రెనీ ఐపిఎస్ అధికారిణి సింధూశర్మ, పెద్దపల్లి, హుజూరాబాద్ డి.ఎస్.పి లు మల్లారెడ్డి, రవీందర్ రెడ్డి, ఎస్.బి ఏ.ఆర్ డి.ఎస్.పిలు సి.ప్రభాకర్, డి.కోటేశ్వరరావు, ఎస్ బిఐ కె.సతీష్ చందర్ రావు, డి.సి.ఆర్.బి ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్, ఆర్.ఐలు గంగాధర్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

డి.ఎస్.పి లకు డిజిపి కమెండేషన్లు

గోదావరి పుష్కరాల సందర్భంగా సమర్ధవంతమైన సేవలందించినందుకు గాను రాష్ట్ర్ర డిజిపి అనురాగశర్మ జిల్లాలోని ఎనిమిది మంది డి.ఎస్.పిలకు కమెండేషన్ పత్రాలను మంజూరు చేశారు.నేర సమీక్షా సమావేశం సందర్భంగా జిల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్ ఎస్.బి, ఎ.ఆర్, పెద్దపల్లి డి.ఎస్.పిలకు కమెండేషన్ పత్రాలను అందజేశారు.

DSC_0306

సమర్దవంతమైన సేవలందించిన కానిస్టేబుళ్ళకు రివార్డులు
నలుగురు దొంగలను పట్టుకుని నాలుగు కేసులను చేధించడంతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న మెట్ పల్లికి చెందిన కానిస్టేబుళ్ళు యం. వెంకటేశం, డి.శ్రీధర్ లకు జిల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్ నగదు రివార్డులను అందజేశారు.

DSC_0308

About The Author

Related posts