Breaking News

గ్రామ జ్యోతులను వెలిగించనున్న కేసీఆర్

kcr

తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. గ్రామాలను అభివృద్ది పరిచే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఇవాళ దేశంలోనే ఉత్తమ గ్రామంగా ఎంపికైన వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గంగాదేవి పల్లె నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గంగాదేవి పల్లి దేశంలోనే ఉత్తమ గ్రామంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది. పారిశుధ్యం, సంక్షేమ పథకాల అమలు, మరుగుదొడ్లు ఇల గ్రామం మొత్తం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఈ గ్రామ అభివృద్దిపై ప్రతిష్టాత్మక గూగుల్ కూడా తమ మ్యాప్స్ లో గ్రామానికి చోటు సంపాదించిపెట్టి 80 లక్షల నిధులు కూడా గ్రామానికి ప్రోత్సాహకంగా ఇచ్చింది..

కాగా 70కిపైగా దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చి గ్రామాన్ని సందర్శించి అభివృద్ధిని పరిశీలించి వెళ్లారు. కాగా సీఎం కేసీఆర్ అందుకే ఈ గ్రామంనుంచే గ్రామజ్యోతి పథకాన్ని ప్రవేశపెడుతున్నారు.

గ్రామ జ్యోతిలో భాగంగా నేటి నుంచి ఈనెల 24 వరకు  గ్రామాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా 25వేల కోట్లను గ్రామాలకు వెచ్చించనుంది.. కాగా ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తలా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ పథకాన్ని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *