
మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఓ మాదిరిగా ఉన్న దానికి బాగా ప్రచారం దక్కడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకం కీలకపాత్ర పోషించింది.. శ్రీమంతుడులో ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ ను పండించి సినిమాను నడిపించాడు. కానీ టీ. ప్రభుత్వం తెలంగాణ గ్రామాల తలరాతలను మార్చే గ్రామజ్యోతి ఈ సినిమా విడుదలైన అనంతరం ప్రకటించారు. దాదాపు ఊళ్లను దత్తత తీసుకోవాలని.. బాగు చేయాలనేది రెండింటి లక్ష్యం..
అందుకే శ్రీమంతులందరూ గ్రామాలను దత్తత తీసుకోవాలనే ప్రచారం మొదలైంది. సీఎం కేసీఆర్ సైతం తెలంగాణలోని ప్రముఖులు, ధనవంతులందరూ వాళ్లని ఊర్లను దత్తత తీసుకోవాలని కోరారు. దీనికి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. మంత్రి కేటీఆర్ సైతం స్వతహాగా మహేశ్ బాబు అభిమాని.. అందుకే ట్విట్టర్ ద్వారా మహేశ్ ను అభినందించి మహబూబ్ నగర్ లో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరారు.ఆయన సరేనన్నారు. దీంతో శ్రీమంతుడు ప్రయోగాన్ని తన నిజజీవితంలో కూడా ఆచరిస్తున్నాడు. ఈ ప్రచారం శ్రీమంతుడు కి చాలా ప్లస్ అయ్యింది. మహేశ్ బాబు సినిమా బాగా ఆదరణ పొందుతోంది..గ్రామజ్యోతి సైతం ప్రశంసలు పొందుతోంది..