
కరీంనగర్: గ్రామీణ ప్రాంత యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి ఎక్కువ శిక్షణా శిబిరాలు నిర్వహించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేటు లోని తన చాంబర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు వారిచే నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ ఆధ్వర్యంలో యువతీ, యువకులకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ ట్రేడుల్లో శిక్షణా కార్యక్రమాల పై ఆమె సమీక్షించారు. గత రెండు సంవత్సరాలుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ప్రగతి సాధించినందుకు అభినందించారు. యువతకు బోర్ వెల్స్ మెకానిజం, డ్రిప్ ఇరిగేషన్, జె.సి.బి. డ్త్ర్రెవింగ్ వంటి వాటిలో కూడా శిక్షణలు ఇప్పించాలని అన్నారు. శాసనసభ నియోజక వర్గ కేంద్రాల్లోను ఎం.పి.డి.ఓ. కమ్యూనిటీ హల్లో
యువతకు శిక్షణ ఇప్పించాలన్నారు. శిక్షణ పొందిన యువతకు బ్యాంకుల ద్వారా గాని, ప్రధాన మంత్రి ముద్ర బుణాలు అందించాలని అన్నారు. బ్యూటీషన్, కంప్యూటర్, ఏయిర్ కండీషన్, పాడి పరిశ్రమ, కూరగాయలు, వంటి వాటిలో శిక్షణ ఇప్పిస్తున్నామని డైరెక్టర్ జయప్రకాశ్ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖచే నిర్వహించబడుచున్న ఈ శిక్షణలకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ, తెలంగాణ గ్రామీణ బ్యాంకులు సహకారం, రుణాలు అందిస్తున్నాయన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాల్లో నిరుద్యోగ యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొని అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలన్నారు. గత సంవత్సరం 138 శాతం, ఈ సంవత్సరం 28 శిక్షణలతో 750 మంది యువతకు ఇప్నటి వరకు ఇప్పించామన్నారు. ఈ సమావేశంలో ఎస్.బి.హెచ్. రీజినల్ ఆఫీసర్ ఎ.ఒ. మల్లికార్జున్ రావు, సురేశ్ కుమార్, పరిశ్రమల శాఖ నుండి రాందాస్, ఉపాధి శిక్షణ కార్యాలయం అధికారులు తదితరులు పాల్గొన్నారు.