గ్రామీణ అవిష్కరణలపైన మరింత దృష్టి : కెటి రామారావు

గ్రామీణ పరిశోధనలకు ప్రోత్సాహంతో ఉపాది

పద్మశ్రీ చింతకింది మల్లేషంకు చేనేత శాఖ తరపున మంత్రి సన్మానం

మల్లేషం ఆసూ మిషన్ల వినియోగాన్ని మరింత పెంచేందుకు సహకరిస్తాం

మల్లేషం చేనేతకు చేసిన సేవలను అపూర్వమైనవి, అయనకు పూర్తి సహాకారం అందిస్తామన్న మంత్రి

గ్రామీణ అవిష్కరణలపైన మరింత దృష్టి సారిస్తామని చేనేత శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. గ్రామాల్లోని పరిశోధనలకు ఊతం లభించినప్పుడే, అక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూరల్ ఇన్నోవేషన్, సోషల్ ఇన్నోవేషన్ రంగంలో యాక్టివ్ గా పనిచేస్తుందని, నిజమాబాద్, వరంగల్, నల్గోండలతో ఇంక్యూబేటర్ల నిర్మాణం వంటి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. చేనేత రంగంలో చేసిన కృషికి పద్మశ్రీ అవార్డు పొందిన చింతకింది మల్లేషంకు చేనేత శాఖ తరపున మంత్రి కెటి రామారావు సన్మానం చేశారు. మల్లేషం లాంటి గ్రామీణ అవిష్కర్తలు అందరికి స్పూర్తి దాయకమని మంత్రి తెలిపారు. మల్లేషం ఆసూ మిషన్ల వియోగాన్ని మరింత పెంచేందుకు సహకరిస్తామని తెలిపారు.

దేశ విదేశాల్లో ఎక్కడెక్కడకో పోయి తెలంగాణ కోసం పెట్టుబడులను కోరుతున్నామన్న మంత్రి, తెలంగాణ నుండి వచ్చిన మల్లేషం లాంటి వినూత్న అవిష్కరణలకు ఖచ్చితంగా మద్దతు ఇస్తామన్నారు. గ్రామాల నుంచి వచ్చే అవిష్కరణలకు ప్రోత్సాహం వలన స్థానికంగా ఉపాది దొరుకుతుందన్నారు. మల్లేషం లాంటి వారికి ప్రొత్సాహం ఇస్తే మరింత మంది వినూత్న అలోచనలతో ముందుకు వస్తారని మంత్రి తెలిపారు. మల్లేషం చేనేతకు చేసిన సేవలను అపూర్వమైనవన్న మంత్రి, అయనకు పూర్తి సహాకారం అందిస్తామని హమీ ఇచ్చారు. చేనేత వస్ర్తాలను నేసే అమ్మ కష్టం చూసి ఆసూ మిషన్ కనిపెట్టిన మల్లేషం చేనేత కోసం మరిన్ని అలోచనలతో ముందుకు రావాలని కోరారు. ముఖ్యంగా భవిష్యత్తులో చేనేత రంగంలో తీసుకురవాల్సిన మార్పులు, నూతన సాంకేతికతలు, ప్రస్తుతం ఉన్నవారికి మార్కెటింగ్ ఎలా పెంచాలన్న అంశాలపైన పలు సూచనలతో ముందుకు రావాలని మల్లేషంను కోరారు. మల్లేషం ప్రతిపాధనలకు కావాల్సిన భూమి ఇవ్వడంతోపాటు, సబ్సీడీపైన స్టేట్ పైనాన్స్ కార్పోరేషన్ ద్వారా పెట్టుబడికి సహకరిస్తామని హమీ ఇచ్చారు. మల్లేషంకు పూర్తి సహకారం అందిచాలని టెక్స్ టైల్స్ డైరెక్టర్ శైలజా రామయ్యార్ ను కోరారు.

About The Author

Related posts