గ్రామీణాభివృద్ధి అధికారుల‌తో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు వీడియో కాన్ఫ‌రెన్స్

ఉపాధికి రానున్న మూడు నెల‌లు కీల‌కం

మూడు నెల‌ల్లో 10 కోట్ల ప‌నిదినాలు వినియోగించుకోవాలి

మెరుగైన ప‌నితీరు క‌న‌బ‌ర్చిన ఉద్యోగుల‌కు ప్రోత్సాహ‌కాలు, వారితో క‌లిసి బోజ‌నం చేస్తాన‌ని

ప్ర‌క‌టించిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

ప‌ని అడిగిన ఏ ఒక్క కూలీకి ప‌ని క‌ల్పించ‌లేక‌పోయినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌

హ‌రిత‌హారంలో నాటిన మొక్క‌ల మ‌నుగ‌డ శాతం త‌గ్గకుండా చూసుకోవాలి

క్షేత్ర‌స్థాయిలో మ‌నుగ‌డ శాతాన్ని క్రాస్ చెక్ చేయాలి

రంగారెడ్డి క‌లెక్ట‌రేట్ నుండి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల‌తో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు వీడియో కాన్ఫ‌రెన్స్‌

హైద‌రాబాద్‌-ఉపాధి కూలీల‌కు రానున్న మూడు నెల‌ల్లో పెద్ద ఎత్తున ప‌ని క‌ల్పించ‌డం ద్వారా 10 కోట్ల ప‌నిదినాలను పూర్తిగా వినియోగించుకునేలా కార్యాచ‌ర‌ణ సిద్దం చేసుకోవాల‌ని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధికారుల‌ను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్ నుండి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల‌తో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. గ‌త సంవ‌త్స‌రం ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల్లో 8 కోట్ల 68 ల‌క్ష‌ల ఉపాధి ప‌నిదినాల‌ను వినియోగించుకున్నామ‌ని…ఈ ఏడాది 10 కోట్లు దాటాల‌న్నారు. ప్ర‌ధానంగా స్కూల్ టాయిలెట్స్‌, అంగ‌న్‌వాడీ భ‌వ‌నాలు, వైకుంఠ‌దామాల నిర్మాణాల‌ను ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించారు.  గ‌త సంవ‌త్స‌రం  మెరుగైన ప‌నితీరు క‌న‌బ‌ర్చిన ఉద్యోగుల‌కు ప్రోత్సాహ‌కాలు అందిద్దామ‌ని…వారి జాబితా సిద్దం చేయాల‌ని ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, క‌మిష‌న‌ర్ నీతూ ప్ర‌సాద్‌ల‌కు సూచించారు. వారితో క‌లిసి తాను బోజ‌నం కూడా చేస్తాన‌ని మంత్రి ప్ర‌క‌టించారు. ప‌నితీరు ప్రాతిప‌దిక‌గా గ్రేడింగ్ ఇవ్వ‌డంతో పాటు బ‌దిలీల్లో వారికి ప్రాధాన్య‌త ఇచ్చే అంశాన్ని కూడా ప‌రిశీలిస్తామ‌న్నారు.  ప‌ని అడిగిన ఏ ఒక్క కూలీకి ప‌ని క‌ల్పించ‌లేక‌పోయినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. 50 ల‌క్ష‌ల 80 వేల మందికి జాబ్‌కార్డులు ఇచ్చామ‌ని…ఇందులో క‌నీసం 60 శాతం మందికైనా 100 రోజుల ప‌ని క‌ల్పించే ల‌క్ష్యంతో ముందుకుపోవాల‌న్నారు. ఉపాధి కూలీల‌కు స‌కాలంలో వేత‌నాల చెల్లింపు జ‌రిగేలా ఎఫ్ టీ ఓల‌ను వారం, ప‌దిరోజుల్లోనే అప్‌లోడ్ చేయాల‌న్నారు. కూలీల‌కు ప‌ని ప్ర‌దేశంలో నీడ‌ను, మంచినీటిని, మెడిక‌ల్ కిట్‌ను త‌ప్ప‌ని స‌రిగా అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు. మొక్క‌ల మ‌నుగ‌డ శాతం త‌గ్గోద్దు హ‌రిత‌హారంలో నాటిన మొక్క‌ల మ‌నుగ‌డ శాతాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌గ్గకుండా చూసుకోవాలని మంత్రి జూప‌ల్లి ఆదేశించారు. ట్యాంక‌ర్ల ద్వారా నీటిని స‌ర‌ఫ‌రా చేసుకోవాల‌న్నారు. మేడ్చ‌ల్‌, నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాల్లో మ‌నుగ‌డ శాతం ఎక్కువ‌గా ఉండ‌టంపై అధికారుల‌ను మంత్రి అభినందించారు. క్షేత్ర‌స్థాయిలో మ‌నుగ‌డ శాతాన్ని క్రాస్ చెక్ చేయాలని…డీఆర్డీఓలు, ఏపీఓల‌తో ర్యాండ‌మ్‌గా మ‌నుగ‌డ శాతాన్ని ప‌రిశీలించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. స‌మావేశంలో ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్‌రాజ్‌, క‌మిష‌న‌ర్ నీతూ ప్ర‌సాద్‌, అధికారులు రామారావు, సైదులు, ఆశా త‌దిత‌రులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *