గ్రామపంచాయితీలలో 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక అమలుపై అవగాహన సదస్సు

 

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకరరావు గారి కామెంట్స్

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం చాలా గొప్పదని,  మన కోసం రూపొందించినదని గ్రహించాలని పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

రాజకీయాలకు అతీతంగా పని చేయాలని,  గ్రామ సమస్యల కోసం అందరి తో కలిసి పని చేయాలని,  దీనితో మన గౌరవం పెరుగుతుందన్నారు.

ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ గా తీసుకున్న ప్రతి కార్యక్రమం విజయవంతం అయ్యిందని,  ఇది కూడ ఖచ్చితంగా అవుతుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ వీటికి నిదర్శనమని, మిషన్ భగీరథ పైపులు వేస్తుంటే.. విమర్శించిన వారే ఇప్పుడు ముక్కున వేలు వేసుకుంటున్నారు అన్నారు.

24 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే చెందుతుందన్నారు.

ఎన్నో ఏళ్ళు గా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారి కలను మన ముఖ్యమంత్రి గారు సాకారం చేశారన్నారు. 25 ఏళ్ల తర్వాత ప్రమోషన్లు కల్పించారన్నారు.

ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి నియామకం చేస్తున్నామని. ఇప్పటికే 9 వేలకు పైగా కార్యద ర్షులను నియమించామన్నారు.

ప్రతీ పైసా… అభివృద్ధి కి ఉపయోగపడాలన్నారు. గ్రామ పంచాయతీ లకు ప్రతి నెల 339 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు.

సర్పంచ్ ఆదేశాల మేరకే ఉపాధి హామీ పనులు జరిగేలా చేశామన్నారు. గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకే ఫీల్డ్ అసిస్టెంట్ పని చేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు.

గతం లో లేని విధంగా నిధులు,అధికారులు ఇప్పుడు మీకు వచ్చాయన్నారు. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం మీ ముందు ఉందన్నారు.

మీ గ్రామ సభ లో కూర్చొని… మీకు ఎన్ని మొక్కలు కావాలో నిర్ణయించుకోండని ఆయన అన్నారు. కానీ ప్రతి మొక్క బతకాలని ఆదేశించారు

రాష్ట్రంలో కోటి 20 వేల చింత చెట్లు మన రాష్ట్రానికి అవసరం ఉందన్నారు.

మీ ఊరి అభివృద్ధి… మీ బాధ్యత అని గుర్తించండని ఆయన వ్యాఖ్యానించారు.

గ్రామ అభివృద్ధి కోసం దాతల ను గుర్తించండని,  చిత్తశుద్ధితో పని చేయాలన్నారు.

ప్రతీ వాడ పరిశుభ్రంగా ఉండాలని, ప్రతి ఊరి పచ్చదనంతో వెళ్లి విరీయాలన్నారు.

బంజరు దొడ్ల తో ఆదాయం పెరుగుతుందన్నారు.

ఎజెండా లో ఉన్న అంశాలనే కాకుండా… మీ ఉరి కి ఎం కావాలో అన్నింటిని గుర్తించండన్నారు.

గ్రామం లోని ప్రతీ అంశం లి సర్పంచ్ లను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు.

స్వీపర్ల నియామకం సర్పంచ్ లకి అప్పగించామన్నారు.

సీఎం కేసీఆర్ గారు కర్మాచారుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. వారి వేతనాన్ని రూ.8500 లకు పెంచారన్నారు.

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తో గ్రామంలో ని ప్రతీ సమస్య తీరనుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

NREGP కింద ఒక కూలి నియామకం.

గ్రామంలో మనం ఎన్నో మంచి కార్యక్రమాల్ని చేయొచ్చన్నారు.

సర్పంచ్ గా ఎన్నిక అవడం చాలా మంచి అవకాశం.. మీరు చేసే ప్రతీ కార్యక్రమం భవిష్యత్ తరాలు స్మరించుకోవాలన్నారు.

అధికారుల సహకారం తో అభివృద్ధి కి బాటలు వేసుకోండన్నారు

టీం వర్క్ తో పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు

పంచాయతీ రాజ్ శాఖ కి ఎన్ని నిధులు కావాలన్న ఇస్తామని…అభివృద్ధి చేసి చూపించండని  ముఖ్యమంత్రి కెసిఆర్  గారు అన్నారన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత ను విస్మరించొద్దని, ప్రజాప్రతినిధులు ప్రజల్లో మమేకం అవ్వండని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.

errabelli dayakar rao 1 errabelli dayakar rao 2     errabelli dayakar rao

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *