‘గ్రామజ్యోతు’లను వెలిగిస్తున్న కేసీఆర్

తెలంగాణ గ్రామాల తలరాత మార్చేందుకు కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. తెలంగాణలో మరో భారీ పతకానికి సీఎం శ్రీకారం చుట్టబోతున్నారు. ఆగస్టు 15నుంచి ప్రారంభం కానున్న  ఈ పథకంతో తెలంగాణలోని గ్రామాలు సుసంపన్నం కానున్నాయి..

తెలంగాణ గ్రామ జ్యోతి పథకంలో భాగంగా గ్రామాల్లో చిన్నపాటి ప్రభుత్వాల మాదిరిగా పనిచేస్తాయి.. గ్రామ ప్రజలు తామే నిర్ణయించుకొని వారి ఊరి అవసరాలకనుగుణంగా పనులు ఎంచుకోవాలి.. తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్లలో 2 నుంచి 5 కోట్ల వరకు నిధులను నేరుగా గ్రామాలకు అందజేస్తుంది.. వీటితో గ్రామస్థులు ఊరిని అభివృద్ధి చేసుకోవాలి.. దీనివల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వాల మాదిరిగా గ్రామాలు స్వయం సంవృద్ది చెందుతాయి..

సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన ఈ మహత్తర పథకానికి ప్రశంసలు వెల్లువెత్తాయి.. ఆంధ్రా మీడియా నుంచి ఆంధ్రా నేతల నుంచి సైతం మంచి స్పందన వచ్చింది.. గ్రామ రూపురేఖలు మార్చే పథకంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *