
ఎక్కడైన మందుతాగితే పిచ్చి ఎక్కుతుంది.. ఇక్కడేంట్రా బాబూ మందు బంద్ చేస్తే ఎక్కింది.. అంటే ఈ లెక్కన ఆ ఊరి మందుబాబులు ఎంత తాగుతారో లెక్కేయండి.. తాగి తాగి ఒక్కసారిగా గ్రామంలో మధ్యపాన నిషేదంతో మందు దొరకక పోయేసరికి పిచ్చిపట్టిన కుక్కల్లా వింత లా ప్రవర్తించారు. 20 మంది పిచ్చిచేష్టలతో ఆస్పత్రి పాలైన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది..
ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం కామోల్ గ్రామంలో పలువురు మందుబాబులు పిచ్చిపట్టినట్టుగా మందు మందు అంటూ తల్లడిల్లి అస్వస్థతకు గురయ్యారు. కామోల్ లో ఇటీవల పంచాయతీ, గ్రామ మహిళలు, గ్రామస్తులు మద్యపాన నిషేధం అమలు చేశారు. మందుతాగినా అమ్మినా భారీ జరిమానాలు వేస్తారని ప్రకటించారు. దీంతో గ్రామంలో మద్యం, గుడుంబా బంద్ అయ్యింది.. ఈ పరిణామం మందుబాబులకు చిక్కులు తెచ్చిపెట్టింది.
రోజు పీకలదాకా తాగే మందుబాబులకు మద్యం దొరకకపోవడంతో వారికి పిచ్చిపట్టినట్టు అరవడం.. వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు 20 మంది మందుబాబులను భైంసా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
ఎక్కడైనా తాగితే ఆస్పత్రికెళ్లడం చూశాం కానీ.. తాగకపోతే వెళ్లడం.. ఇదే మొదటిసారి.. అయినా ఆ మందుబాబులు మద్యం కు ఎంత బానిసలయ్యారో దీన్ని బట్టి తెలుస్తోంది..