Breaking News

గ్యాస్ కనెక్షన్లు విడుదల విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తాం: పివి మదన్ మోహన్

1780751_923025104398229_1388510451807217280_n_005

అతి త్వరలో తెలంగాణాలోని అన్ని జిల్లాలో దారిద్ర్య రేకకు దిగువనున్న పేద ప్రజలకు దీపం పథకం క్రింద జారీ చేసే గ్యాస్ కనెక్షన్లు విడుదల విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర యల్.పి.జీ.సమన్వయ సంఘం సభ్యులు పి.వి.మదన్‌మోహన్ సూచించారు.
శనివారంనాడు మధ్యాహ్నం కరీంనగర్ లో ఒక ప్రయివేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా యల్.పి.జీ.డీలర్ల వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొంటూ తెలంగాణాలో సుమారు 20 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, దీనికి ముఖ్య భూమిక పోషించిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్, మంత్రి  ఈటల రాజేందర్, యం.పి. వినోద్ కుమార్ క్రుషి  మరవలేనిదని తెలిపారు. సంపన్న వర్గాల కుటుంబాలు గ్యాస్ రాయితీలు పొందుతున్నారని స్వచ్ఛందంగా రాయితీ వదులుకొని పేద ప్రజలకు చేయూతనివ్వాలని కోరారు. జిల్లా యల్.పి.జి సంక్షేమ సంఘం
అధ్యక్షులు రాధాక్రిష్ణ బొమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మదన్ మాట్తాడుతూ జిల్లాలోని వంట గ్యాస్ డీలర్లు వ్యాపారమే ధ్యేయంగా కాకుండా సామాజిక హితకు చేయూత నిస్తున్నారని, జిల్లా కలెక్టరు, సంయుక్త కలెక్టర్,  పిలుపు మేరకు గోదావరీ పుష్కరాల సందర్భంలో కాళేశరంలొ విధులు నిర్వహించే సిబ్బంది కి 12 రోజుల భోజన సదుపాయానికి తమ సంఘం 2 లక్షలను విరాళంగా అందించామని తెలిపారు.ఆర్థిక కార్యదర్శి గట్టు రాజయ్య తమ నివేదికలో తమ సంఘం ఆర్థిక పద్దుల విషయంలో జవాబుదారీ విధానాన్ని అవలంబించడం వల్ల డీలర్లు అమోఘమైన సహకారాలు అందిస్తున్నారని వివరించారు.
డెలివరీ సిబ్బంది కి మన: పూర్వకంగా యిచ్చేపారితోషికానికి తాము వ్యతిరేకం కాదని, రీఫిల్ ధర కన్న ఎవరైనా ఎక్కువ డిమాండ్ చేస్తే తమ ద్రుష్టికి తేవాలని కోరారు.
తెలంగాణా ప్రాంతీయ వంట గ్యాస్ డీలర్ల సమావేశం కరీంనగర్‌ కేంద్రంగా నిర్వహించాలని తీర్మానించింది.
వివిధ కారణాలవల్ల మరణించిన దీపం మహిళ స్థానంలోనే కుటుంబ సభ్యుల పేర కనెక్షన్ మార్పిడీ వెంటనే చేయాలని తీర్మానించింది.
జిల్లా నాయకులు భాగ్యమ్మ, వెంకటరెడ్డి, సతీష్, గణేశ్‌, దీన్ దయాల్, సత్యనారాయణ, సంతోష్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *