గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారిన ఎయిర్ పోర్టు…

గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారిన ఎయిర్ పోర్టు...

హైదరాబాద్: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారిపోతోంది. విమానాశ్రయంలో పెద్ద ఎత్తున పట్టుబడుతున్న బంగారం అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవల వరుసగా అక్రమ బంగారాని కస్టమ్ అధికారులు పట్టుకున్న సంఘటనలు మరువకముందే తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు 2కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌ఈడీ ల్యాంప్ లోపలి భాగంలో బంగారు బిస్కెట్లు పెట్టి తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వరుస అక్రమ బంగారం రవాణా జరుగుతున్న అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారన విమర్శలు ఎదుర్కోంటున్నారు.
శంషాబాద్ విమానాశ్రయం అక్రమ గోల్డ్ రవాణాకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. గోల్డ్ స్మగ్లర్లు శంషాబాద్ ఎయిర్ పోర్టునే టార్గేట్ చేసుకుని చెలరేగిపోతున్నారు. దీంతో విదేశాల నుండి బంగారం అక్రమ రవాణా చేసే వ్యాపారులకు హైదరాబాద్ మహానగరం ప్రధాన ద్వారంగా మారిపోతోంది. మునుపెన్నడూ లేని విధంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకుంటున్నారు.
ఇటీవల శంషాబాద్ ఎయిర్ పోర్టులో వరుసగా అక్రమ బంగారం పట్టుబడుతోంది. మొన్న ఓ వ్యక్తి నుంచి కిలో బంగారాన్ని పట్టుకున్న సంఘటన మరువకముందే తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎల్‌ఈడీ లైట్లలో బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సింగపూర్‌ నుంచి టైగర్‌ ఎయిర్‌వేస్‌ ఫ్లైట్‌లో ఈరోజు ఉదయం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తిని అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అతని నుంచి పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కె‍ట్లను ఎల్‌ఈడీ లైట్లలో అమర్చడంతో పాటు శరీర భాగాల్లో అమర్చుకుని స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. అతని వద్ద నుంచి 2 కిలోల బంగారం ,59.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌ఈడీ లైట్ల లోపల 8, శరీర భాగాల్లో 12 బంగారు బిస్కెట్లను గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.
అయితే అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న తీరు చూస్తుంటే అధికారులే బిస్తుపోతున్నారు. అక్రమ బంగారాన్ని బట్టల్లో, షూల్లో, కాపీ పౌడర్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ఒంటిమీద దుస్తువుల్లో వేసుకుని తీసుకొస్తున్నారు స్మగ్లర్లు. కస్టమ్స్ అధికారులు, పోలీసుల కళ్లుగప్పటానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు అధికారులకు చిక్కితే.. మరికొందరు గుట్టుచప్పుడు కాకుండా ఎస్కెప్ అవుతున్నారు.
దుబాయ్, సింగపూర్, నేపాల్, ధాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేషీయా దేశాల సరిహద్దుల నుంచి భారీగా స్మగ్లింగ్ జరుగుతోంది. మిగతా దేశాలతో పోలిస్తే గతంలో దుబాయ్ నుంచే గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేది. ఇప్పుడు మలేషియా సింగపూర్ కూడా ముందు వరుసలో ఉన్నాయి. తాజాగా చైనా కూడా గోల్డ్ దందాలో చేరిపోయింది. ఇక శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏడాదికి సుమారు 90 నుంచి 100 కిలోలు అక్రమంగా గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు సమాచారం. శంషాబాద్ ఎయిర్ పోర్టును టార్గేట్ చేసుకున స్మగ్లర్లు వరుస అక్రమ బంగారం రవాణా చేస్తున్న.. అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారన విమర్శలు ఎదుర్కోంటున్నారు.
అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టులో వరుసగా జరుగుతున్న అక్రమ బంగారం పరిణామాల వెనుకాల ఎయిర్ పోర్టు, కస్టమ్స్, డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సిబ్బంది పాత్రపై అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని విమానంలో తీసుకురావాలంటే ఎయిర్ట్ పోర్టు, కస్టమ్స్, డీఆర్ ఐ ఇందులో ఎవరో ఒక్కరు సహకరించకుంటే దిగుమతి చేయడం అంత సులభం కాదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎయిర్ పోర్టులో చీమ్మచిటుకుమన్న పటేసుకుంటారు అధికారులు. గట్టి భద్రత, డేగ కళ్లతో నిఘా, అత్యాధునిక టెక్నాలజీ కల్గిన స్నానింగ్ మిసన్లు, సీసీ కెమెరాలు, ఇలా కంచుకోట లాంటి భద్రత కల్గిన శంషాబాద్ ఎయిర్ పోర్టులో రోజుకు పుట్టలకొద్ది అక్రమ బంగారం పట్టుబడుతోంది.
అయితే అక్రమ బంగారం పట్టుబడిన విషయాన్ని అధికారులు మీడియాకు తేలియజేస్తేనే ఆ విషయం బయట ప్రపంచానికి తెలుస్తోంది. అధికారులు చెప్పకుంటే రెండోకంటికి కూడా తెలియదు. అక్రమ బంగారం దిగుమతి వెనుక అధికారులు, ఎయిర్ పోర్టు సిబ్బంది ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక బయట ప్రపంచానికి తెలియకుండా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎంత అక్రమ బంగారం జరుగుతుందోనని అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టును టార్గేట్ చేసుకున్న స్మగ్లర్లు వరుస అక్రమ బంగారం రవాణా చేస్తున్న.. అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారన విమర్శలు ఎదుర్కోంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *