
గోల్కొండ పత్రిక స్వరూపం, శీర్షికలు , పత్రిక పాలసీ విధానం బయటకొచ్చాయి.. సీనియర్ జర్నలిస్ట్ దేవరకొండ కాళిదాస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ‘ఈ న్యూస్ గోల్కొండ పత్రిక’ తెలంగాణ లో మరో ప్రాంతీయ పత్రికకు పురుడుపోస్తుంది.
తెలంగాణలో ఏడు ఎడిషన్లతో, పూర్తి కలర్ పేజీలతో అధునాతన టెక్నాలజీతో, సరికొత్త హంగు, అర్భాటాలతో అతిత్వరలో తెలంగాణలో గోల్కొండ పత్రిక ప్రత్యక్షం కాబోతోంది. గోల్కొండ పత్రిక చైర్మన్ కాళిదాసు పత్రిక రూపురేఖలపై బ్రోచర్లో వివరించారు.