
డబ్ స్మాష్ ఇప్పుడు ఎక్కడా చూసిన దీని గురించే.. ఎక్కడ విన్న దాని పేరడీనే.. సార్ట్ ఫోన్లలో వాడే ఈ యాప్ ఇప్పుడు కుర్రకారుని, యువత, మహిళల్ని ఊపేస్తోంది.. ఈ డబ్ స్మాష్ యాప్ లో ఫేమస్ సినిమా పాటలు, డైలాగుల్ని అదే వాయిస్ తో మనం నటించి చూపడమన్నమాట.. ఇప్పుడు నెట్ లో కొత్త విప్లవాత్మక మార్పుకు కారణమైన ఇది మున్ముందు ఇంకా చాలా మంది మనసు దోచుకుంటోంది..
కొందరు బాలయ్య సినిమా డైలాగ్ చెబితే.. మరికొందరు కేసీఆర్ వాయిస్ తో బెదిరిస్తున్నారు.. బొక్కలిరుగుతయ్ బిడ్డా అంటూ తెలంగాణ యాసను అనుకరిస్తున్నారు. చిరంజీవి లా మాటలు, మహేశ్ లా చేతలు.. చంద్రబాబులా పేరడీలు కాదేదీ డబ్ స్మాష్ కు అనర్హం .. మీరూ చూడండి.. డబ్ స్మాష్ లు ఆద్య అనే అమ్మాయి.. గోపికమ్మలా ఏలా తీయగా పాడుతుందో.. అచ్చం గోపికమ్మే పాడుతున్నట్టు ఉంది కదూ..