
హైదరాబాద్, ప్రతినిధి : ప్రముఖ దర్శకులు గుణశేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్రను పోషిస్తున్న ‘అల్లు అర్జున్’ ఫస్ట్ లుక్ విడుదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటూ త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. రుద్రమదేవి చిత్రం భారతదేశంలోనే మొట్టమొదటి స్టీరియో స్కోపిక్ త్రీడీ చిత్రంగా నిర్మితమౌతోంది.