Breaking News

గోదావరికి నీటి విడుదల కోసం ‘మహా’ గవర్నర్ జోక్యం

05-kcr-vidyasagar-rao-odi-600

తెలంగాణలో గోదావరిలో నీటి చుక్క కరువైంది. భక్తులు స్నానం చేసేందుకు కనీసం మోకాళ్ల లోతు కూడా నీటి జాడ లేదు. దీంతో ప్రాజెక్టుల నుంచి నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. కానీ ఆ నీరు పుష్కర ఘాట్లకు చేరే వరకే ఇంకిపోవడం.. ఆవిరైపోవడం జరుగుతోంది.

దీంతో గోదావరి పుష్కరాలకు నీటికోసం సీఎం కేసీఆర్ మహారాష్ట్ర గవర్నర్ ఫడణవీస్ కు లేఖ రాశారు. బాసర, ధర్మపురి వరకు నీరు రావాలంటే మహా ప్రాజెక్టులనుంచి కొన్ని టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. కాగా మహాసీఎం అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

కాగా మహారాష్ట్ర నుంచి నీటి విడుదల చేసే బాధ్యతను సీఎం కేసీఆర్ మహారాష్ట్ర గవర్నర్ , తెలంగాణకు చెందిన విద్యాసాగర్ రావుకు అప్పగించారు. ఎలాగైన మహారాష్ట్ర సీఎంను ఒప్పించి నీటి విడుదల చేయాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *