గొల్కొండ వచ్చేది వాటికి చెక్ పెట్టడానికేనట..

గొల్కొండ పత్రిక ఆవిర్భావంతో తెలంగాణలో మరో పత్రిక పురుడు పోసుకుంటోంది.. మెదక్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పురుడుపోసుకుంటున్న ఈ పత్రికకు మెదక్ జిల్లా నుంచి ఉన్న మంత్రి హరీష్, స్పీకర్ మధుసూదనాచారి అండదండలున్నాయి..

కాగా ప్రత్యేకించి గొల్కొండ పత్రిక వస్తుంది తెలంగాణలోని యాడ్స్ పొందడం కోసమే.. ప్రభుత్వం నుంచి వచ్చేకోట్ల రూపాయల యాడ్స్ ఆంధ్రా పత్రికలకు ఇచ్చే కంటే తెలంగాణ పత్రికలకే ఇచ్చి మన సొమ్ము మనకే చెందాలన్న కృత నిశ్చయంతో ఈ పత్రిక తెస్తున్నారు..

ముఖ్యంగా టాప్ 4లో ఉన్న ఈనాడు, సాక్షి, నమస్తే, ఆంధ్రజ్యోతిల్లో మిగతా మూడు ఆంధ్రాపత్రికల్లో ఒక దాన్ని యాడ్స్ నుంచి తీసేయాలంటే మరో పత్రిక ఉండాల్సిందే.. తెలంగాణ ప్రభుత్వం టాప్ 4 పత్రికలకు యాడ్స్ ఇస్తుంటుంది. దీన్నే దృష్టిలో ఉంచుకొనే గొల్కొండను భారీ గా లాంచ్ చేసి సాక్షి కానీ, ఆంధ్రజ్యోతికి కానీ ప్రభుత్వ యాడ్స్ దక్కకుండా చేయాలనే ఉద్దేశంతోనే గొల్కొండ వస్తోందట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *