గొలుసు దొంగకు ఐదేళ్ళ జైలు శిక్ష…

ఇకపై గొలుసు దొంగల భరతం పట్టనున్నారు పోలీసులు.. సిటీలో పెరిగిన సీసీ కెమెరాలతో పీడీ, యాక్ట్ కేసులతో స్నాచర్లకి చెక్ పెడుతున్నారు పోలీసులు. ఇక నుంచి పక్కా ఆధారాలతో నేరగాళ్ళకి చుక్కలు చూపించేందుకు సిద్దమవుతున్నారు.. అంతేకాదు దీనికి సాంపిల్ గా ఓ స్నాచింగ్ కేసులో కోర్టులో పక్కా ఆధారాల్ని సబ్మిట్ చేయడంతో ఏకంగా ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. హైదరాబాద్ నగరంలో ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకి పాల్పడుతున్న ఘరానా స్నాచర్ కి కళ్ళెం వేశారు పోలీసులు. మహిళల మెడలో నుంచి బంగారు గోలుసులు లాక్కొని పారిపోతున్న స్నాచర్ కు ఐదేళ్ళ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్ట్ తీర్పు నిచ్చింది. పాతబస్తీ చాంద్రాయణగుట్ట కు చెందిన హబీబ్ అబ్బాస్ బట్టల వ్యాపారం చేస్తుండేవాడు.. వచ్చే ఆదాయం సరిపోక పోవడంతో పైడ్ ట్రాక్ పట్టి చైన్ స్కాచర్ అవతారమెత్తాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్నాచింగ్ లో చేస్తూ.. 2015 లో పోలీసులకు రెడ్ హ్యండెడ్ గా చిక్కాడు. అయితే గతంలో స్నాచింగ్ కేసుల్లో అరెస్టయిన నిందితులు బెయిల్ పై ఈజీగా రిలీజయ్యేవారు.. తర్వాత తిరిగి స్నాచింగ్ నేరాలకి పాల్పడటం రివాజుగా ఉండేది. అయితే రీసెంట్ గా వరుస స్నాచింగ్స్ కి పాల్పడుతున్న నేరగాళ్ళపై పీడీ యాక్ట్ కేసులు ప్రయోగిస్తుండడంతో స్నచర్ల కోరలు పీకినట్లయింది.. బట్ నగరంలో వరుస స్నాచింగెలకి పాల్పడుతూ మహిళల్ని బెంబేలెత్తిస్తున్న అబ్బాస్ కేసులో ఓ అడుగు ముందుకేసారు సిటీ కాప్స్.. ఈ కిలాడీ స్నాచర్ చేసిన 150 స్నాచింగ్ ఘటనల్ని ఒక్కచోట చేర్చి పక్కా ఆధారాల్ని సేకరించి, అబ్బాస్ ని అరెస్టు చేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు పోలీసులు.. కేసుని పరిశీలించిన నాంపల్లి కోర్ట్ ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు కళ్లు గప్పి నేరగాళ్లు కొత్తపుంతలు తొక్కుతుంటే.. వాళ్ల ఆగడాలకి చెక్ పెట్టడంతో పాటు వరుస చోరీలకి పాల్పడే కేటుగాళ్ళకి వార్నింగ్ మెసేజ్ ఇచ్చేందుకే ఈ కేసులో పక్కా వర్కవుట్ చేశామంటున్నారు పోలీసులు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *