గొర్రెల పెంపకందారుల సంక్షేమం కోసం రెండు వేల కోట్లు…

రాష్ట్ర్రంలో గొర్రెల పెంపకందారుల సంక్షేమం కోసం 2 వేల కోట్ల రూపాయల కర్చుతో 4 లక్షల కుటుంబాలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని రాష్ట్ర్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర్ర గొర్రెలు, మేకల పెంపకందారుల సహకారసంఘ ప్రతినిధుల రాష్ట్ర్రస్ధాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రతి కుటుంబానికి 20+1 చొప్పున 80 లక్షల గొర్రె పిల్లలను పంపిణీ చేసేందుకు ఆశాఖ ఆయా రాష్ట్ర్రాలలో పర్యటిస్తుందని ఆయన వివరించారు. ప్రతి ఏటా యాదవ సోదరులు అత్యంత ఘనంగా నారాయణగూడలో నిర్వహించేసదర్ ఉత్సవాలను వచ్చే సంవత్సరం నుండి రాష్ట్ర్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్ర్రంలో రెండు వేరు వేరు వర్గాలుగా న్న కుర్మ, యాదవ సోదరులను ఏకం చేస్తూ 10 లక్షల మందితో నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు తాను ప్రణాళికల రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాసయాదవ్ వివరించారు.నిజాం కళాశాల సభకు ముందు ఆయా జిల్లాలలో కుర్మ, యాదవ సోదరులను ఏకం చేస్తూ జిల్లా స్ధాయి సమావేశాలు నిర్వహించి నిజాం కళాశాల సభకు సన్నద్ధం చేసే ప్రక్రియలో ఇరు కులాలకు చెందిన రాష్ట్ర్రస్ధాయి నాయకులు వెన్నుదన్నుగా తనతో కలిసి రావాలని ఆయన ఆయా సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 12వ తేదీన మాజీ ఎమ్మెల్సీ అరికెల నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ లో ప్రభుత్వ సంక్షేమాలను దృష్టిలో ఉంచుకుని యాదవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు ఈ సభకు ఆయా కులాలకు చెందిన పెద్దలందరు తరలివచ్చి యాదవుల ఐక్యతను చాటే విధంగా సభను విజయవంతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా యాదవ కులస్తులందరికి విజ్ఞప్తి చేశారు. గొర్రెల పెంపకం దారులకు ఇచ్చే ఎక్స్ గ్రేసియాను లక్ష రూపాయల నుండి ఆరు లక్షల రూపాయలకు పెంచేందుకు ప్రభుత్వం సూత్ర్రప్రాయంగా అంగీకరించిందని మంత్రి ప్రకటించారు. దేశానికి 1947లో స్వాతంత్ర్ర్యం వచ్చినా యాదవ, కుర్మలకు మాత్రం తెలంగాణ రాష్ట్ర్రం వచ్చిన తర్వాతనే స్వాతంత్ర్ర్యం వచ్చిందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా తీసుకోని నిర్ణయాలు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తీసుకున్నారని చెప్పారు. అసెంబ్లీ, శాసనమండలిలో ఎప్పుడు కూడా గొర్రెల పెంపకదారులు, చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి గురించి చర్చించిన దఖలాలు లేవన్నారు. గత ప్రభుత్వాలు పశుసంవర్ధక, మత్స్య శాఖలకు తగిప ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఈ జాతుల వారు అభివృద్ధికి నోచుకోలేదని వివరించారు. యాదవులు, కుర్మలు, ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తూ అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. గొర్రెల పంపిణీ పై ఇచ్చే రుణంలో కేవలం 25 శాతం సబ్సిడీ మాత్రమే గత ప్రభుత్వాలు ఇచ్చాయని, కానీ ముఖ్యమంత్రి సబ్సిడీని 75 శాతంకు పెంచారని చెప్పారు. ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణయాలతో రానున్న రోజులలో ఈ శాఖలు తో ప్రాధాన్యత కలిగినవిగా మారతాయన్నారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే ఎన్ సిడిసి నిధులకు గత ప్రభుత్వాలు గ్యారెంటీ ఇవ్వకపోవడంతో మంజూరు కాలేదని, మన ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళిన వెంటనే స్పందించి రాష్ట్ర్ర ప్రభుత్వం గ్యారెంటీని ఇచ్చారని వివరించారు. రాష్ట్ర్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడం వలన 400 కోట్ల రూపాయలు మంజూరైనాయని, ఆ నిధులను గొర్రెల పెంపకదారులకు పావలా వడ్డీకే అందించినట్లు తెలిపారు. నట్టల నివారణ మందును వేసే కార్యక్రమానికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 3 దఫాలుగా వేయటం జరుగుతుందని, దీనిని 4 దఫాలుగా వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు. పశువైద్యశాలల ద్వారా అందుతున్న వైద్యసేవలను పర్యవేక్షించేందుకు ఆన్ లైన్ విధానం ప్రారంభించామని, ఎక్కడి నుండైనా చికిత్స విధానం, మందుల పంపిణీని తెలుసుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని పశువులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 సంచార పశువైద్య వాహనాలను మే మొదటి వారం నాటికి ప్రారంభించనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఎన్ సిడిసి క్రింద వచ్చిన 400 కోట్ల రూపాయలు సరిపోవని, కనీసం 3 వేల కోట్ల రూపాయలు మంజూరయ్యే విధంగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు. రాష్ట్ర్రంలో 4.50 లక్షల గొర్రెల పెంపకదారులు ఉన్నారని, వారికి మేలు చేయాలనే తలంపుతో 20+1 చొప్పున ప్రతి సంవత్సరం లక్ష కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. పంపిణీ చేసేందుకు అవసరమైన గొర్రెల కోసం అధికారులు ఇతర రాష్ట్ర్రలలో పర్యటిస్తున్నారని, ఈ ప్రాంత వాతావరణానికి అనుగుణంగా, తట్టుకోగలిగే జాతుల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు. గొర్రెల పెంపకదారుల సొసైటీలో ఓటుహక్కు కలిగిన యాదవ, కుర్మలకు ప్రతిఒక్కరికి సభ్యత్వ నమోదుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. వేసవిలో దాణా కొరత ఏర్పడుతుందని, దాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలను సరఫరా చేస్తుందని, జీవాల పెంపకదారులు తమ తమ భూములలో గడ్డిని పెంచుకోవడం ద్వారా దాణా కొరతను నివారించవచ్చన్నారు. మిగులు దాణాను విక్రయించుకోవడం ద్వారా ఆర్ధికంగా వెసులుబాటు ఉంటుందని వివరించారు. విజయడెయిరీకి పాలు విక్రయించే వారికి లీటరు పాలకు 4 రూపాయలు చొప్పున ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుందని, దీని వలన ప్రభుత్వానికి ప్రతిఏటా సంవత్సరానికి 72 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. విజయ డెయిరీని మరింత అభివృద్ధి చేసేందుకు గాను ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. యాదవులు ఆర్ధికంగా అభివృద్ధి చెందినప్పుడే అన్నిరంగాలలో రాణించగలరని అన్నారు. గతంలో ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోలేదని, మన ముఖ్యమంత్రి యాదవ, కుర్మలకు అడగకుండానే వరాలు ఇచ్చారని, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రుణపడి ఉండారని చెప్పారు. దీపావళికి యాదవులు నిర్వహించుకునే సదర్ ను వచ్చే సంవత్సరం నుండి రాష్ట్ర్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కృష్ణాఫ్టమిని అన్ని జిల్లాలలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. యాదవ, కుర్మల ఐక్యతను చాటేందుకు నిజాం కళాశాల మైదానంలో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలని పిలుపునిచ్చారు. యాదవ, కుర్మల ఐక్యతను చాటేందుకు నిజాం కళాశాల మైదానంలో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో సమకార సంఘాల అధ్యక్షులతో పాటు కుర్మ, యాదవ సంఘాలకు చెందిన రాష్ట్ర్రస్ధాయి నాయకులతో పాటు గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పశుసంవర్ధక శాఖ, డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మంజువాణి, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర్ర అధ్యక్షుడు బాబురావ్ యాదవ్, కుర్మసంఘం రాష్ట్ర్ర అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం, యాదవసంఘం రాష్ట్ర్ర కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్, కార్పోరేటర్లు శంకరయాదవ, హేమలత యాదవ్, నాగేందర్ యాదవ్, పలు జిలల్లకు చెందిన సొసైటీల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *