గొర్రెల పంపిణీ కార్యక్రమంలో రీసైక్లింగ్ కు అడ్డుకట్ట

రాష్ట్ర్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో రీసైక్లింగ్ కు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని గురువారం సచివాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నిర్ణయించారు.రాష్ట్ర్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి.సింగ్ తో పాటు ఇతర శాఖలను కూడా సమన్వయ పరిచేందుకు ట్రాన్స్ ఫోర్ట్ విభాగం నుండి ఆశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మను, హోంశాఖ నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది లను ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ప్రత్యేకంగా ఆహ్వనించడం జరిగింది. వీరితో పాటు

ఈ సమావేశంలో గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఛైర్మన్ రాజయ్య యాదవ్, పశుసంవర్ధక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి లు  సచివాలయం నుండి హజరుకాగా, ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీల తో పాటు పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా, జిల్లా ఎస్పీ, జిల్లా పశు వైద్య అధికారి సభ్యులుగా వ్యవహరిస్తారు. పేద ప్రజల ఆర్ధిక అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి మదిలో నుండి జాలువారిన ఈ యొక్క గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్భందీగా నిర్వహించి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సమావేశంలో కలెక్టర్లను ఆదేశించారు. కొంతమంది స్వార్ధపరులు ఈ యొక్క పధకాన్ని తమ స్వార్ధ ప్రయోజనాలకోసం రీసైక్లింగ్ కు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన దరిమిలా
ఈ యొక్క పధకాన్ని మరింత పకడ్బందీగా అమలు పరిచేందుకు ఈ యొక్క వీడియో కాన్ఫరెన్ప్ ను నిర్వహిస్తున్నట్లు మంత్రి జిల్లా అధికారులను వివరించారు. ఇటీవల నల్లగొండ జిల్లా నుండి గుంటూరు జల్లా అధికారులను అప్రమత్తం చేయడంతో దాదాపు 6 వాహనాలను, అందులో తరలిస్తున్న గొర్రెలను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి తెలిపారు.
సకాలంలో స్పందించిన నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ను మంత్రి అభినందిస్తూ మిగతా జిల్లా కలెక్టర్లు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎలాంటి అనుమానం వచ్చినా ఆ యొక్క వాహనాలను పూర్తిగా తనిఖీ చేసిన మీదటనే అనుమతించాలని ఆయన వివరించారు. ప్రభుత్వ ముఖ్య ఉద్దేశాన్ని అధికారులందరు అర్ధంచేసుకొని ఈ యొక్క పధకాన్ని మరింత పకడ్భందీగా అమలుపరుస్తూ ఈ వృత్తిపై ఆధారపడి ఉన్న వారికి న్యాయం జరిగేలా చూడాలని ఆయన వివరించారు. మన రాష్ట్ర్రంలో జరుగుతున్న ఈ యొక్క గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఇటీవలనే కర్నాటక, మహరాష్ట్ర్ర నుండి ఆయాశాఖల మంత్రులు వచ్చి ఈ పధకం అమలుపై ముఖ్యమంత్రిని అభినందించిన విషయం గురించి ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు వివరించారు. పశువులకు వైద్యసేవలు అందించేందుకు ఇటీవల ప్రారంభించిన సంచార పశువైద్య శాలల సేవలను వీక్షించిన ఇతర రాష్ట్రాల మంత్రులు ఆశ్చర్యపోయారని, ఇలాంటి పధకాన్ని తమ రాష్ట్ర్రంలో కూడా అమలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిచుకుంటామని ముఖ్యమంత్రి వివరించినట్లు మంత్రి తలసాని తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న ఈ యెక్క గొర్రెలు వాతావరణ మార్పుల కారణాల వల్ల మరణిస్తున్నందున ఆ యెక్క రైతులకు ఇన్సూరెన్స్ లబ్బిని అందించే విధంగా అధికారులు మరింత అంకితభావంతో కృషి చేయాలని ఆయన అన్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు ఇన్సూరెన్స్ శాఖకు చెందిన ఇద్దరు అధికారులను కూడా ఒక్కొక్క జిల్లాకు కేటాయించాలని ఇన్సూరెన్స్ శాఖ వారిని కోరినట్లు మంత్రి వివరించారు. గొర్రె చనిపోయినట్లు సమాచారం అందుకున్న వెంటనే ఆయా జిల్లా వైద్యశాఖ అధికారులు దానికి సంబందించిన ప్రక్రియను పూర్తిచేసి బాధితుడికి సకాలంలో న్యాయం జరిగే విధంగా చూడాలని ఆయన వివరించారు.

కేవలం ఇన్సూరెన్స్ నిమిత్తమే ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందని, కాబట్టి ఈ విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీలు తమ నిబంధనలకు కొన్ని సడలింపులు ఇచ్చి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆయన వారిని కోరారు. ఈ యొక్క పధకం అమలు పట్ల ఆయా జిల్లా కలెక్టర్లు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను పధకం అమలుపై తీసుకోవాల్సిన మార్పులను ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వివరించారు. ప్రధానంగా టార్గెట్ ను బేరీజు వేసుకోకుండా  ఆరోగ్యవంతమైన గొర్రెలను మాత్రమే కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించే విధంగా తమకు సహకరించాలని కలెక్టర్లు సూచించారు. ప్రతినెల చివరివారంలో సాధించిన లక్ష్యాలను బేరీజు వేసుకుంటూ వచ్చే నెల ప్రణాళికలు జరుపుకునే విధంగా చివరివారంలో కొనుగోలుకు సడలింపును ఇవ్వాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ వీడియో కాన్ఫరెన్స్ లో సూచించారు. కొనుగోలు చేసిన గొర్రెల ఫోటోలను ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేసేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

ఇప్పటి వరకు కొనుగోలు చేసిన గొర్రెలలో అప్ లోడ్ చేయని గొర్రెల ఫోటోలను వారం ఫోటోలను అప్ లోడ్ చేసే ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తిచేయాలని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇటీవల 100 సంచార పశువైద్యశాలలను ప్రారంభించిందని, వాటి సేవలను రైతులు సద్వినియోగం చేసుకునే విధంగా 1962 టోల్ ఫ్రీ నెంబర్ పై విస్త్ర్రృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు. వర్షాలు కురుస్తున్న కారణంగా జీవాలకు వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండి వైద్యసేవలు అందించాలని ఆయన అన్నారు. గొర్రెలకు అవసరమైన దాణాను అటవీశాఖ, ఉద్యానవన శాఖ భూములలో పెంచడం జరుగుతుందని, రైతులు తమ భూములలో గడ్డిని పెంచే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు.

VIDIO CONFERENCE

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *