గొప్ప ఉద్యమకారుడి.. సాదా నిష్క్రమణం..

కోదండరాం.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కర్త అయితే కోదండరాం కర్మ.. అంతటి ఉద్యమకారుడి ప్రొఫెసర్ పదవికి రిటైర్మెంట్ చాలా సాదాసీదాగా జరిగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉస్మానియా పీజీ కళాశాల అధ్యాపకుడిగా పనిచేస్తున్న కోదండరాం ఈనెల 30న పదవీ విరమణ పొందారు. ఈ కార్యక్రమం మామూలుగా జరిగింది. కొంత మంది విద్యార్థులు, అధ్యాపకులు ఆయనను సన్మానించి నాలుగు మాటలు మాట్లాడారు..

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కోదండరాంకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు.. ఆయన పదవీ విరమణకు సీఎం కేసీఆర్, ప్రతిపక్షాలు , ఉద్యమకారులు వచ్చి ఘనంగా సన్మానిస్తారని అనుకున్నాం.. కానీ ఇంత నిర్దయగా కోదండరాం నిష్క్రమణ జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండం..

కేసీఆర్ కరుణ లేకపోవడమే కొందడ రాం ప్రస్తుత పరిస్థితికి కారణం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కోదండను రాజకీయ ప్రవేశం చేయమని కేసీఆర్, ఎంపీ పదవి ఇస్తామని బీజేపీ, టీడీపీ వేడుకున్నాయి.. కానీ ఆయన అధ్యాపక వృత్తినే నమ్ముకొని రాజకీయాలను త్యజించారు. ఉద్యమకారుడిగానే ఉంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు కేసీఆర్ కు వ్యతిరేకంగా సదస్సులు, సమావేశాల్లో మాట్లాడారు. పాల్గొన్నారు. ఇదే ఆయనను దూరం పెట్టింది. కేసీఆర్ క రుణకు దూరం చేేసింది.. ప్రతిపక్షాలు పట్టించుకునేలా చేసింది..

ఎంతటి ఉద్యమకారుడి ఇంత సాదాసీదాగా రిటైర్ అవ్వడం అందరికీ బాధ కలిగించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *