గొంతు క్యాన్స‌ర్ వ‌చ్చినా చ‌క్క‌గా ఆహారం పెట్టొచ్చుః డాక్ట‌ర్ రాజా

హైదరాబాద్ః- గొంతు క్యాన్స‌ర్ వ‌స్తే ఆహారం తినే అవ‌కాశంలేక రోగులు నీర‌శించి, వ్యాధి తీవ్ర‌మై మృత్యువుకు ద‌గ్గ‌రవుతున్న సంఘ‌ట‌న‌ల‌కు ప‌రిష్కారం లేదా?..ఉంద‌నే చెబుతున్నారు ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వ్యాధి నిపుణులు డాక్ట‌ర్ రాజా.వి.కొప్ప‌ల‌. నోటి ద్వారా ఆహారాన్ని న‌మిలి మింగ‌లేనివారికి ఓ ప్ర‌త్యేక నాళాన్ని నేరుగా పొట్ట‌కు అమ‌ర్చి, ఆహారాన్ని ఇవ్వ వ‌చ్చున‌ని డాక్ట‌ర్ రాజా వివ‌రించారు. దీనివ‌ల్ల రోగికి నిస్స‌త్తువ ఆవ‌హించ‌ద‌ని, రోగ‌నిరోధ‌క శ‌క్తి తగ్గ‌ద‌ని, ఫ‌లితంగా వ్యాధి నుంచి త్వ‌ర‌గా కోలుకో వ‌చ్చున‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ కొత్త ప్ర‌క్రియ‌ను పాశ్చాత్య దేశాల‌లో బాగా అమలు చేస్తున్నార‌ని, దీనినే ఇంట‌ర్వెన్ష‌న్ అంకాల‌జీ అని అంటార‌ని ఆయ‌న తెలిపారు. అదేవిధంగా క్యాన్స‌ర్ రోగుల‌కు కీమోధెర‌ఫీ ఇవ్వ‌డానికి ప్ర‌తిసారీ ర‌క్త‌నాళానికి సూదులు గుచ్చ‌కుండా ఒక కేవీధెర‌పీ పోర్ట్‌ను పెట్ట‌వ‌చ్చున‌ని డాక్ట‌ర్ రాజా చెప్పారు. ఇది ఒక రిజ‌ర్వాయ‌ర్ వ‌లే ప‌ని చేస్తుంద‌ని, రోగికి చాలా సౌల‌భ్యంగా ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. ఇవేగాక కాలేయ క్యాన్స‌ర్‌, కిడ్నీ క్యాన్స‌ర్‌తోపాటు మ‌రికొన్ని ర‌కాల క్యాన్స‌ర్‌ల‌కు ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని డాక్ట‌ర్ రాజా తెలిపారు.ఈ నూత‌న విధానంలో భాగంగా క్యాన్స‌ర్ క‌ణాల‌ను కేధ‌ట‌ర్ ప‌ద్ధ‌తి లేదా రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారాగాని ఒక్క క్యాన్స‌ర్ క‌ణాల‌నే నేరుగా మ‌ట్టుపెట్టే ప‌ద్ధ‌తి వ‌చ్చింద‌ని ఆయ‌న వివ‌రించారు.
లివ‌ర్ క్యాన్స‌ర్‌కు ర‌క్త‌నాళం ద్వారా కేధ‌ట‌ర్ ప‌ద్ద‌తిలో అత్యంత ద‌గ్గ‌ర‌లోకి పంపి క్యాన్స‌ర్ క‌ణాల‌కు కీమోధెర‌పీ ఇవ్వ వ‌చ్చున‌ని వివ‌రించారు. దీనివ‌ల్ల , కీమోధెర‌పీ మందువ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ అతి స్వ‌ల్ప‌మేన‌ని చెప్పార‌. రేడియోల‌జీ ద్వారా క్యాన్స‌ర్ రోగుల‌కు ఇత‌ర సేవ‌ల‌ను కూడా అందించ‌వ‌చ్చున‌ని డాక్ట‌ర్ రాజా తెలిపారు. ఈ అంశాల‌పై ఎటువంటి స‌ల‌హాలు కావాల‌న్నా, సందేహాలు క‌లిగినా త‌మ‌కు నేరుగా 9908677715 నెంబ‌రుకు ఫోన్‌చేసి తెలుసుకోవ‌చ్చున‌న్నారు. క్యాన్స‌ర్ ముద‌ర‌క‌ముందే వ్యాధిని క‌నుగొని నివారించ‌వ‌చ్చున‌ని, దీనిపై అవ‌గాహ‌న అవ‌స‌ర‌మ‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌రిచేందుకే త‌మ వంతు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు ఎవిస్ హాస్సిట‌ల్ అధినేత డాక్ట‌ర్ రాజా తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *