‘గే’ల కోసం చట్టం మార్చుతున్నారు…

తమిళనాడులో పోలీస్ నియామకాల్లో ట్రాన్స్ జెండర్లు దరాఖాస్తు చేసుకోవడంతో వారిని తీసుకోవాలా వద్దా అనే అంశంపై సంశయం నెలకొంది.   అక్కడ పోలీస్ నియామకాల్లో ఓ ట్రాన్స్ జెండర్ ప్రతిభ చాటి ఎస్సై పోస్టుకు ఎంపికైంది. కానీ అక్కడి పోలీస్ శాఖ ఆమె నియామకాన్ని రద్దు చేసింది. మేల్, ఫిమేల్ కాకుండా ఉన్న ఈ ‘ట్రాన్స్ జెండర్’ లను ఏ ప్రాతిపదకన తీసుకోవాలో చట్టంలో లేదంటూ ఆమెను తిరస్కరించారు. దీంతో చైన్నై హైకోర్టుకు ఆ ఆశ్రయించిన ఆ గే కు ఊరట లభించింది. ఆమెను ఎస్సైగా ఎంపిక చేయాలని ఆదేశించింది. దీంతో చివరకు కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఎస్సైగా ప్రస్తుతం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

కానీ ఇప్పటికీ ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగ, ఉపాధి నియామకాల్లో రిజర్వేషన్లు లేవు.. వారికి హక్కులు లేవు. దీంతో జనాభాలో పెరుగుతున్న వారికి అన్యాయం జరుగుతోంది. ఈ సమస్యపై స్పందించిన ఆ రాష్ట్రానికే చెందిన డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ ప్రవేశపెట్టిన ప్రేవేటు బిల్లును ఇప్పటికే రాజ్యసభలో చర్చ జరిగి ట్రాన్స్ జెండర్లకు హక్కులను ఆమోదించారు. ‘స్వలింగ సంపర్క బిల్లు’ను లోక్ సభ తిరస్కరించింది.  బీజేపీ ఇది మతపరమైన దురాభిమానం అంటూ తిరస్కరించడంతో బిల్లు చట్టరూపం దాల్చడం లేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *