గెలుపు గుర్రాలు నారదాసు, భానులు..

కరీంనగర్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లాలో పోటీనే లేకుండా దూసుకుపోయింది. కారు జోరుకు ప్రతిపక్షాలన్నీ సైడ్ అయి పోయాయి.. అసలు పోటీనే లేకుండా మంత్రి ఈటెల రాజేందర్ , ఇతర టీఆర్ఎస్ నాయకులు చక్రం తిప్పడంతో నారదాసు, భాను ప్రసాద్ రావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..

అనంతరం శనివారం రాత్రి రిటర్నింగ్ అధికారి , జేసీ పౌసుమి బసు ఎమ్మెల్సీలుగా గెలుపొందిన భాను ప్రసాద్ రావు, నారదాసు లక్ష్మణ్ రావులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

అనంతరం కార్యకర్తలు టపాసులు కాల్చి నారదాసు, భానుప్రసాద్ రావులను ఊరేగంచారు. సంబరాలు చేసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *