
గూగుల్ సీఈవోగా నియమితులైన భారతీయుడు సుందర్ పిచ్చైకి అదిరిపోయే వేతన ప్యాకేజీని ఇచ్చింది గూగుల్ సంస్థ. ఆ పదవి చేపట్టేందుకు ఏకంగా 310 కోట్ల వార్షిక వేతనం ఆఫర్ చేసింది.. ఇప్పటికే అత్యధిక వేతనాలు తీసుకుంటున్న భారతీయుల్లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెల్ల ముందు వరుసలో ఉన్నారు. ఇక ఆయత తరువాత ఇప్పుడు గూగుల్ సీీఈవోగా సుందర్ కు కూడా భారీ వేతన ప్యాకేజీ లభించడం గమనార్హం.
గూగుల్ సీఈవోగా నియమితులు కాక ముందు సుందర్ క్రోమ్, గూగుల్ స్టోర్, ఆండ్రాయిడ్ అప్లికేషన్లను సృష్టించారు. అవి ఘనవిజయం కావడంతోనే ఈ పదవి దక్కింది.