
ఆయన పేరు నికేశ్ అరోరా.. వయసు 47 వారణాసిలో ఐఐటీ చేశారు. ఇన్నాళ్లు ప్రఖ్యాత గూగుల్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన ప్రతిభాసామర్థాలతో గూగుల్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. బాగా మార్కెటింగ్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు.. దీంతో ఆయనను సాఫ్ట్ బ్యాంకు ఆహ్వానించింది.
గూగుల్ కు రాజీనామా చేసిన అరోరా సాఫ్ట్ బ్యాంకులో చేరారు. చేరిన వెంటనే స్నాప్ డీల్, ఓలా క్యాబ్స్ లాంటి దిగ్గజ సంస్థలతో సాఫ్ట్ బ్యాంకుకు జత కలిపారు. దీంతో ఆయనను సాఫ్ట్ బ్యాకు సీఈవో, చైర్మన్ గా నియమించారు. ఆయన వార్షిక వేతనం రూ.810 కోట్లు. కల్లు చెదిరే వేతనానికి ఆయనను దక్కించుకుంది. ఇంత భారీ వేతనం ఎవరికీ ఇప్పటికీ దక్కలేదు..