
బాహుబలి2 ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ వైపు వేగంగా కొనసాగుతున్నాయి.. ఇటీవలే రాజమౌళి రిలాక్స్ కోసం విదేశాలకు టూర్ వెళ్లాడు.. ఇటీవలే తిరిగివచ్చిన రాజమౌళి అనుకోకుండా హైదరాబాద్ లోని గూగుల్ క్యాంపస్ కు వెళ్లాడు.. ఉద్యోగులతో సెల్ఫీలు దిగాడు.. అక్కడున్న పనివాతావరణంపై రాజమౌళి ప్రశంసలు కురిపించారు.
పనిచేస్తున్నట్టు లేదని.. అక్కడ ఆడుతూ పాడుతూ పనిచేస్తారని.. జంపింగ్లు, ఉయ్యాలలు, జారుడు బండలు ఇలా ఉద్యోగుల సరదా కోసం చాలా ఏర్పాట్లున్నాయట క్యాంపస్ లో.. అందుకే ఇదంతా చూసి గూగుల్ క్యాంపస్ ను మెచ్చుకున్నారు రాజమౌళి..
కాగా గూగుల్ క్యాంపస్ లోకి రాజమౌళి వెళ్లడానికి ప్రదానంగా ఆయన బాహుబలి 2 సినిమా కోసమేనని తేలింది.. బాహుబలి2లో కొన్ని అద్భుత సీన్లను ఎలా తీర్చిదిద్దాలో వాళ్ల క్రియేటివిటీ గురించి అడిగి తెలుసుకున్నారట.. వారి ముచ్చటించి సరదాగా గడుపుతూ వాళ్ల ప్రశ్నలకు జవాబులిచ్చారు.